Orange : ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్స్ అన్ని కోట్లా.. అంతా జనసేన పార్టీకే..

రామ్ చరణ్ (Ram Charan) బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ అయిన 'ఆరెంజ్' (Orange) సినిమా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది.

Orange : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరోసారి మిస్టర్ బాక్స్ ఆఫీస్ అనిపించుకున్నాడు. ప్లాప్ మూవీతో రీ రిలీజ్ లో కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు. మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత చరణ్ నుంచి వచ్చిన సినిమా ‘ఆరెంజ్’ (Orange). రొమాంటిక్ లవ్ స్టోరీగా 2010 లో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ పరాజయాన్ని అందుకుంది. కానీ ఇప్పటి ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో రీ రిలీజ్ లో థియేటర్ లు హౌస్‌ఫుల్ లు అయ్యాయి. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 26న రిలీజ్ అయ్యింది.

Ram Charan : ది రోర్ ఆఫ్ రామ్.. అదిరిపోయే లుక్స్ తో నేషనల్ మ్యాగజైన్ పై రామ్ చరణ్..

అప్పటి నుంచి మొదలైన బర్త్ డే సెలబ్రేషన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికి పలు సెంటర్స్ లో హౌస్ ఫుల్ షోలు పడుతున్నాయి. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా 3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని రికార్డు సృష్టించింది. ఇంకా షోలు పడుతుండడంతో కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఒక ప్లాప్ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ అందుకోవడంతో మెగా అభిమానులు సందడి చేస్తున్నారు. ఇక ఈ కలెక్షన్స్ అన్నిటిని జనసేన పార్టీకి ఇవ్వబోతున్నట్లు ఆల్రెడీ నాగబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో జనసైనికులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Ram Charan : దుబాయ్ బయలుదేరిన రామ్‌చరణ్, ఉపాసన..

కాగా రామ్ చరణ్ ప్రస్తుతం హాలిడే వెకేషన్ లో ఉన్నాడు. మొన్నటి వరకు సినిమా షూటింగ్స్ అండ్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్న చరణ్.. కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఉపాసనతో కలిసి దుబాయ్ హాలిడే ట్రిప్ కి వెళ్ళాడు. అక్కడి నుంచి వచ్చాక ‘గేమ్ చెంజర్’ (Game Changer) షూటింగ్ లో పాల్గొనున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Ram Charan Orange re release collections crores 3 crores gross

 

ట్రెండింగ్ వార్తలు