Peddi Collection: 400 కోట్లు వసూల్ చేసిన పెద్ది.. స్పెషల్ వీడియో రిలీజ్..
రామ్‌చరణ్ నటించిన పెద్ది మూవీ (Peddi Collection) 400 కోట్ల క్లబ్‌లో చేరింది.
- Thota Vamshi Kumar
- Updated on- June 17, 2026 / 05:39 PM IST
Ram Charan peddi enter into 400 crore club
Peddi Collection: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన పెద్ది బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేసింది. ఓ స్పెషల్ వీడియోను ఫ్యాన్స్‌తో పంచుకుంది. దీంతో రామ్‌చరణ్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. రామ్‌చరణ్ నటన, గ్రామీణ నేపథ్యం, ఎమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.
*Anjali : తెలుగు అందం పుట్టిన రోజు.. అంజలి బర్త్ డే స్పెషల్ ఫోటోలు వైరల్..
దివ్యేందు, బొమన్ ఇరానీ, జగపతి బాబు,రవి కిషన్ కీలక పాత్రల్లో నటించగా.. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా లు ఈ మూవీని నిర్మించారు.
*Tejaswi Madivada : చీరలో అలా.. డ్రెస్‌లో ఇలా.. తగ్గేదేలే అంటున్న తెలుగు అందం తేజస్వి..
