Peddi Collections : 300 కోట్ల క్ల‌బ్‌కు చేరువ‌లో.. నాలుగు రోజుల్లో పెద్ది క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా న‌టించిన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది.

Ram Charan Peddi four days Collections

Peddi Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా న‌టించిన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. మూడు వంద‌ల కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టేందుకు చేరువ‌గా వ‌చ్చింది. విడుద‌లైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 292.5 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రం నేడు మూడు వంద‌ల కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్ట‌డం ఖాయ‌మ‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు. బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం తొలి రోజున 135.36 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే.

Vishnu Priya : ఎల్లో క‌ల‌ర్ శారీలో విష్ణు ప్రియ క్యూట్ ఫోటోలు.. కుర్రాళ్ల‌కు నిద్ర క‌రువే..

మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా ఈ చిత్రాన్ని నిర్మించ‌గా.. జ‌గ‌ప‌తి బాబు, దివ్యేందు, బొమ‌న్ ఇరానీ, ర‌వి కిష‌న్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న, గ్రామీణ నేప‌థ్యం, క్రీడ‌ల అంశాలు, ఎమోష‌న‌ల్ కంటెంట్‌కు ఆడియ‌న్స్ జై కొడుతున్నారు.

Rahul Ramakrishna : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ప్ర‌శ్నించిన క‌మెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ..