Peddi Censor Review: ‘పెద్ది’ సెన్సార్ టాక్ అవుట్.. థియేటర్లలో మెగా పూనకాలే.. చరణ్ కెరీర్‌లోనే మైండ్‌బ్లోయింగ్ మూవీ
రామ్ చరణ్ పెద్ది సినిమా సెన్సార్(Peddi Censor Review) కంప్లీట్ చేసుకుంది.
- V Santhosh Kumar
- Updated on- May 20, 2026 / 05:15 PM IST
Ram Charan Peddi Movie Censor Review viral on social media
- రామ్ చరణ్ ‘పెద్ది’ సెన్సార్ పూర్తి
- చివరి 45 నిమిషాలు ఎమోషనల్ పీక్స్
- వెయ్యి కోట్ల కలెక్షన్లపై భారీ అంచనాలు
Peddi Censor Review: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న పక్కా విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా కావడం, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. టాలీవుడ్‌లో గత కొన్ని నెలలుగా సరైన బ్లాక్‌బస్టర్ లేక థియేటర్లు వెలవెలబోతుండటంతో, ట్రేడ్ వర్గాలతో పాటు బయ్యర్లు అందరూ బాక్సాఫీస్ కరువును తీర్చేందుకు వస్తున్న ‘పెద్ది’ చిత్రంపైనే తమ ఆశలన్నీ పెట్టుకున్నారు.
Vaddi Kaasulavada: మంచు మనోజ్ కొత్త మూవీ ‘వడ్డీ కాసులవాడా’.. ఆసక్తిరేపుతున్న అనౌన్స్‌మెంట్ వీడియో
మరో రెండు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు. ఇటీవల ముంబైలో భారీ ఎత్తున నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ట్రైలర్‌పై సోషల్ మీడియాలో కొంత భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, తాజాగా పూర్తయిన సెన్సార్(Peddi Censor Review) టాక్ వింటే మాత్రం మెగా అభిమానులకు పూనకాలు రావడం ఖాయమనిపిస్తోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘U/A’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది.
సెన్సార్ సభ్యుల ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. 3 గంటల 2 నిమిషాల నిడివి గల ఈ సినిమాలో బుచ్చిబాబు రామ్ చరణ్‌ను నటుడిగా సరికొత్త శిఖరాలకి తీసుకెళ్లారు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, గూస్‌బంప్స్ ఇచ్చే సీన్లతో సాగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లోని చివరి 45 నిమిషాల ఎమోషనల్ ఎపిసోడ్‌లో చరణ్ నటన ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తుందని, జగపతి బాబు పాత్ర కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని సమాచారం. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ‘రంగస్థలం’ రికార్డులను తిరగరాస్తూ రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ న్యూస్ తెలిసి మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
