Vaddi Kaasulavada: మంచు మనోజ్ కొత్త మూవీ ‘వడ్డీ కాసులవాడా’.. ఆసక్తిరేపుతున్న అనౌన్స్మెంట్ వీడియో
మంచు మనోజ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ వడ్డీ కాసులవాడ(Vaddi Kaasulavada).
Manchu manoj Vaddi kasula vada movie announcement video
- మంచు మనోజ్ ‘వడ్డీ కాసులవాడా’ అనౌన్స్మెంట్
- ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సరికొత్త కథ
- అనిల్ సుంకరతో 16 ఏళ్ల తర్వాత
Vaddi Kaasulavada; వైవిధ్యభరితమైన కథలను, వైబ్రెంట్ ఎనర్జీతో కూడిన పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో మంచు మనోజ్. ముఖ్యంగా కామెడీ, యాక్షన్, ఎమోషన్స్‌ను సమపాళ్లలో పండిస్తూ ప్రేక్షకాదరణ పొందిన ఆయన.. సుదీర్ఘ విరామం తర్వాత సరికొత్త ఎనర్జీతో, వైవిధ్యమైన స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇటీవల ఆయన నటించిన మిరాయ్ బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే.
Sreemukhi: బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గ్లామర్ బ్లాస్ట్.. అందాలకు ఫ్యాన్స్ ఫిదా
తాజాగా మరో కొత్త సినిమాను స్టార్ చేశాడు ఈ హీరో. మంచు మనోజ్ తన తాజా చిత్రం ‘వడ్డీ కాసులవాడా’ (Vaddi Kaasulavada) ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. సామాన్య మానవుడు నిత్యజీవితంలో ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు, పోరాటాల నేపథ్యంలో ఈ సినిమా కథాంశం సాగనుంది. ఈ స్క్రిప్ట్ వినగానే తనకు బాగా నచ్చిందని, రూటెడ్ హ్యుమర్, ఎమోషన్స్‌తో కూడిన ఈ కథ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని, తన కామెడీ టైమింగ్‌ను ఇష్టపడే వారికి ఇది ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుందని మనోజ్ పేర్కొన్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను తేజ్ ఉప్పలపాటి డైరెక్ట్ చేస్తుండగా, వరుస హిట్స్‌తో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థ ఎకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. మంచు మనోజ్ కెరీర్లో నిలిచిపోయిన ‘బిందాస్’ సినిమా తర్వాత దాదాపు 16 ఏళ్లకు నిర్మాత అనిల్ సుంకరతో ఆయన మళ్లీ అసోసియేట్ కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన పవర్ఫుల్ ఏఐ (AI) టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను క్రియేటర్ రవితేజ దామేరియా నేతృత్వంలోని బృందం అద్భుతంగా డిజైన్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
What better way to surrender all our struggles than to place them at the feet of VADDI KAASULAVADA 🙏🏻
I’ve always wanted to come up with something rooted in the common man’s everyday financial struggles, and the moment this script came to me, everything aligned and it instantly… pic.twitter.com/5kPixAnKTs
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 20, 2026
