Peddi Release Date: ‘పెద్ది’ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. అఫీషియల్ అనౌన్స్.. రక్తంతో తడిచిన చరణ్ పోస్టర్ కూడా..

Peddi: తాజాగా నేడు పెద్ది సినిమా మొదటి ప్రెస్ మీట్ ని నిర్వహించారు.

Ram Charan Peddi Release Date Announced

Peddi Release Date: బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, గ్లింప్స్ తో ఫ్యాన్స్ లో సినిమాపై హైప్ పెరిగింది. కానీ ఇప్పటికే పలుమార్లు పెద్ది సినిమా వాయిదా పడింది. ఇటీవల బుచ్చిబాబు ఓ సినిమా ఈవెంట్లో పెద్ది సినిమా జూన్ 25 వస్తుందని ప్రకటించారు.

*‘జెట్లీ’ మూవీ రివ్యూ.. కమెడియన్ సత్య హీరోగా చేసిన సినిమా.. ఎలా ఉందంటే..?

తాజాగా నేడు పెద్ది సినిమా మొదటి ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి నిర్మాతలు, సుకుమార్, డైరెక్టర్ బుచ్చిబాబు సాన, డీఓపీ రత్నవేలు.. పలువురు మూవీ టీమ్ హాజరయ్యారు. ఈ ప్రెస్ మీట్ లో పెద్ది సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సినిమాని జూన్ 4వ తేదీనే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సినిమా చెప్పిన డేట్ కంటే ముందుకు రావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో చరణ్ రక్తతో తడిచిపోయి దెబ్బలతో ఉన్నాడు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది.