Peddi: ఒకరు కాదు ఇద్దరు స్టార్స్.. పెద్ది స్పెషల్ సాంగ్ మరింత స్పెషల్ గా.. బుచ్చిబాబు మామూలోడు కాదు

రామ్ చరణ్ పెద్ది(Peddi) సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.

ram charan peddi movie special song update

  • పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్
  • ఏకంగా ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో మరింత స్పెషల్ గా
  • ఫ్యాన్స్ కోసం మాస్టర్ ప్లాన్ రెడీ చేసిన బుచ్చిబాబు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో ముఖ్యంగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’పై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. సాధారణంగా, స్టార్ హీరోల సినిమాల్లో ఉండే స్పెషల్ సాంగ్స్ అంటే ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ పాటలో మెరిసే హీరోయిన్ ఎవరు, హీరోలు వేసే స్టెప్పులు ఎలా ఉంటాయనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు బుచ్చిబాబు పెద్ది సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం భారీ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Chiranjeevi: మెగాస్టార్ ను కలిసిన సాయి రాజేష్.. స్పెషల్ ఫొటోస్ షేర్ చేసిన డైరెక్టర్

అందేంటంటే, పెద్ది సినిమాలోని స్పెషల్ సాంగ్ ను మరింత కలర్‌ఫుల్‌గా, గ్రాండ్‌గా మార్చేందుకు ఏకంగా ఇద్దరు టాప్ హీరోయిన్లను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. సాధారణంగా ఒక స్టార్ హీరోయిన్ ఉంటేనే థియేటర్లు దద్దరిల్లుతాయి, అలాంటిది ఇద్దరు భామలతో రామ్ చరణ్‌ చిందేస్తే ఆ సందడి వేరే లెవల్లో ఉంటుందని చిత్రబృందం భావిస్తోంది. ప్రస్తుతం ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎవరనే విషయంలో చిత్ర యూనిట్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది.

వచ్చే నెలలోనే ఈ భారీ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ చరణ్ అద్భుతమైన డాన్సర్ కావడంతో, ఆయన గ్రేస్‌కు తగ్గట్టుగా అదిరిపోయే స్టెప్పులను కొరియోగ్రాఫ్ చేయిస్తున్నారట. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో ఈ పాట హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలు, ఈ స్పెషల్ సాంగ్ అప్‌డేట్‌తో మరింత పెరిగే అవకాశం ఉంది. మరి పెద్దితో ఆడిపాడే ఆ ఇద్దరు లక్కీ హీరోయిన్లు ఎవరో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.