Peddi Trailer: మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘పెద్ది’ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది
రామ్ చరణ్ పెద్ది ట్రైలర్(Peddi trailer) రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించిన మేకర్స్.
- V Santhosh Kumar
- Updated on- May 11, 2026 / 05:47 PM IST
mega power star ram charan peddi movie trailer releasing on may 18th
Peddi Trailer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా చిత్ర యూనిట్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను మే 18వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా “పెద్ది గాడి ప్రయాణం చాలా ప్రత్యేకం” అంటూ విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
*Ravi teja: రెమ్యునరేషన్ పూర్తిగా తగ్గించిన రవితేజ.. వామ్మో.. మరీ ఇంత తక్కువా?
రామ్ చరణ్(Peddi trailer) కెరీర్‌లో ఇది ఒక విభిన్నమైన ప్రాజెక్ట్ అని, గ్రామీణ నేపథ్యంలో సాగే భావోద్వేగపూరిత ప్రయాణమని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ మేకోవర్ మరియు బుచ్చిబాబు మేకింగ్ స్టైల్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ అప్‌డేట్ రావడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. మే 18న రానున్న ట్రైలర్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక భారీ అంచనాల మధ్య పెద్ది సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
