Peddi Trailer: రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్ రిలీజ్.. ఎప్పుడు? ఎక్కడ?

పెద్ది సినిమా జూన్ 4న రిలీజ్ కాబోతుందని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. (Peddi)

  • Updated on- May 12, 2026 / 06:32 AM IST

Ram Charan Peddi Movie Trailer Update

Peddi Trailer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో భారీగా పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ.. పలువురు కీలక పత్రాలు పోషిస్తున్నారు.

పెద్ది సినిమా జూన్ 4న రిలీజ్ కాబోతుందని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు పెద్ది సినిమా నుంచి రెండు సాంగ్స్, రెండు గ్లింప్స్ వచ్చాయి. వాటితోనే సినిమాపై భారీ హైప్ నెలకొంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ టాలీవుడ్ లో వినిపిస్తుంది.

Also Read : Navya Swamy : హిమాలయాల్లో నవ్యస్వామి.. చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తూ.. ఫొటోలు..

మూవీ యూనిట్ సమాచారం ప్రకారం పెద్ది సినిమా ట్రైలర్ మే 18న రిలీజ్ చేస్తారని సమాచారం. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో భారీగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తారని తెలుస్తుంది. దీంతో పెద్ది ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. పెద్ది సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు నార్త్ లో కూడా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.