Peddi OTT: ఓటీటీలోకి పెద్ది.. ఏ రోజున, ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?
Peddi OTT Date: మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన పెద్ది (Peddi) మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది.
- Thota Vamshi Kumar
- Updated on- July 4, 2026 / 12:33 PM IST
Ram charan Peddi ott streaming date fix
Peddi OTT: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన లేటెస్టు మూవీ పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. జాన్వీకపూర్ కథానాయికగా నటించిన ఈ మూవీ 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వారికి శుభవార్త అందింది.
ఓటీటీలో ఈ చిత్ర స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా వెల్లడించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 9 నుంచి పెద్ది మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ బాషల్లో అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.
Read Also – Roja Daughter Anshumalika : రోజా కూతురు సోల్ మేట్ ఎవరో తెలుసా? ఫోటోలు షేర్ చేసిన అన్షు..
దివ్యేందు, బొమన్ ఇరానీ, జగపతి బాబు,రవి కిషన్ కీలక పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా లు ఈ చిత్రాన్ని నిర్మించారు.
