Peddi 9 Days Collection: సరికొత్త రికార్డు సెట్ చేసిన పెద్ది.. సౌత్ ఇండియాలోనే..
Peddi Collection: రామ్‌చరణ్ పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
- Thota Vamshi Kumar
- Updated on- June 13, 2026 / 02:59 PM IST
Ram Charan peddi set new record 9 days 366 crores
Peddi Collection: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం విడుదలైన 9 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 366 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి.. ఈ ఏడాది సౌత్ ఇండియా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని ఓ సరికొత్త పోస్టర్ ద్వారా చిత్ర బృందం తెలియజేసింది.
బుచ్చిసాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జాన్వీ కపూర్ కథానాయిక. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మరో రెండు లేదా మూడు రోజుల్లో 400 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
*Drishyam 3 : ఓటీటీలోకి దృశ్యం 3.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా లు నిర్మించగా.. జగపతి బాబు, దివ్యేందు, బొమన్ ఇరానీ, రవి కిషన్ కీలక పాత్రల్లో నటించారు.
