Ram Charan Peddi Trailer: క్రికెట్, కుస్తీనే కాదు.. ‘పెద్ది’లో ఇంకో గేమ్ కూడా.. ట్రైలర్‌లో సర్ ప్రైజ్ అదిరిందిగా..

అయితే పెద్ది సినిమాలో ఇప్పటికే క్రికెట్, కుస్తీ గేమ్స్ ఉన్నాయి అని తెలిసిందే. (Peddi Trailer)

  • Updated on- May 18, 2026 / 05:19 PM IST

Ram Charan Peddi Trailer Have Surprise To Fans With Another Game

Ram Charan Peddi Trailer : రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా జూన్ 4న పెద్ది పాన్ ఇండియా వైడ్ భారీగా రిలీజ్ కానుంది. ఇప్పటికే వచ్చిన రెండు గ్లింప్స్, సాంగ్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. నేడు ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ తో సినిమాపై మరింత హైప్ నెలకొంది. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది అంటున్నారు ఫ్యాన్స్, ప్రేక్షకులు.

అయితే పెద్ది సినిమాలో ఇప్పటికే క్రికెట్, కుస్తీ గేమ్స్ ఉన్నాయి అని తెలిసిందే. కుస్తీ కోసం చరణ్ ప్రాణం పెట్టి మరీ చాలా రిస్క్ చేసి కష్టపడ్డాడు. అయితే ఈ సినిమాలో మరో గేమ్ కూడా ఉందని ట్రైలర్ తో రివీల్ చేసారు.

Also Read – Peddi Trailer : రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్ వచ్చేసింది.. నేను పెద్ది సారు.. అదిరిపోయిందిగా.. అసలు క్లైమాక్స్ షాట్ అయితే..

పెద్ది సినిమాలో రన్నింగ్ గేమ్ కూడా ఉంది. రామ్ చరణ్ రన్నర్ గా కూడా కనపడబోతున్నాడు. రన్నింగ్ లో కూడా నేషనల్ లెవల్స్ ఆడబోతున్నట్టు క్లైమాక్స్ లో ఓ షాట్ కూడా ఉంది. ఓ కుర్రాడు నా ఫేవరేట్ రన్నర్ పెద్ది అని చెప్పే డైలాగ్ కూడా ఉంది. దీంతో రామ్ చరణ్ ఈ సినిమాలో క్రికెటర్ గా, కుస్తీ వీరుడిగా, రన్నర్ గా కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది. ఈ సర్ ప్రైజ్ తో ఫ్యాన్స్ సైతం ఆనందిస్తున్నారు.

మీరు కూడా పెద్ది ట్రైలర్ చూసేయండి..