Ram Charan-NTR : చరణ్ వర్సెస్ ఎన్టీఆర్.. పెద్ది వర్సెస్ డ్రాగన్.. ఒక్కరోజు గ్యాప్ లో..
రామ్ చరణ్ పెద్ది సినిమా ట్రైలర్ వర్సెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గ్లింప్స్ అనే చర్చ జరుగుతుంది. (Ram Charan-NTR)
- Saketh U
- Updated on- May 12, 2026 / 09:59 AM IST
Ram Charan NTR
Ram Charan-NTR : మరోసారి చరణ్ వర్సెస్ ఎన్టీఆర్ అనే చర్చ నడుస్తుంది. ఈ హీరోలిద్దరి ఫ్యాన్స్ మళ్ళీ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4న రాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ తోనే సినిమాపై విపరీతమైన హైప్ పెరిగింది.
పెద్ది సినిమా ట్రైలర్ మే 18న రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ తాజాగా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ ఈ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. ఆ రోజు ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తారని అధికారికంగానే ప్రకటించారు. మే 19 అర్ధరాత్రే ఎన్టీఆర్ డ్రాగన్ గ్లింప్స్ రిలీజ్ చేస్తారట. ఇక డ్రాగన్ సినిమా 2027 జూన్ 11న విడుదల చేస్తామని ప్రకటించారు.
Also Read : Suriya-Vijay : సూర్య ఈవెంట్‌లో విజయ్ కి ఎలివేషన్ ఇచ్చిన దర్శకుడు.. ఫ్యాన్స్ విమర్శలు..
దీంతో రామ్ చరణ్ పెద్ది సినిమా ట్రైలర్ వర్సెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గ్లింప్స్ అనే చర్చ జరుగుతుంది. పెద్ది ట్రైలర్ మే 18న వస్తుండగా డ్రాగన్ గ్లింప్స్ మే 19 అర్ధరాత్రి వస్తుంది. ఒక్క రోజు గ్యాప్ లోనే ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన కంటెంట్ రాబోతుంది. దీంతో ఫ్యాన్స్ యూట్యూబ్ లో ఏది ఎక్కువ వ్యూస్ వస్తాయి? ఏది ఎక్కువ లైక్స్ తెచ్చుకుంటుంది? ఎవరు ఫాస్ట్ గా 1 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంటారు? పెద్ది – డ్రాగన్ కంటెంట్ లో ఏది ఫ్యాన్స్ ని మెప్పిస్తుంది అని సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి.
ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఎంత క్లోజ్ గా ఉంటారో, వాళ్ళిద్దరి మధ్య ఎంత మంచి స్నేహం ఉందో RRR సినిమా సమయంలో చూసాం. వాళ్లిద్దరూ బాగున్నా ఫ్యాన్స్ మాత్రం RRR రిలీజ్ అయిన దగ్గర్నుంచి ఫ్యాన్ వార్స్ చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి పెద్ది ట్రైలర్ – డ్రాగన్ గ్లింప్స్ తో పోటీ పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్.
Also See : Patas Praveen : జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ పెళ్లి.. హల్దీ వేడుకల ఫోటోలు షేర్ చేసిన భార్య..
