Peddi Twitter Review : ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా చూసిన ఆడియన్స్ ఏమంటున్నారు? చరణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే..

ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్, సినిమా లవర్స్ పెద్ది సినిమా చూసి తమ అభిప్రాయాలను ట్విట్టర్ లో పంచుకుంటున్నారు. (Peddi Twitter Review)

  • Updated on- June 4, 2026 / 07:02 AM IST

Peddi Twitter Review

Peddi Twitter Review : రామ్ చరణ్ పెద్ది సినిమా నేడు జూన్ 4న థియేటర్స్ లో రిలీజ్ అయింది. బుచ్చిబాబు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ముందు రోజు రాత్రే ఈ సినిమాకు ప్రీమియర్స్ కూడా వేశారు. ఓవర్సీస్ లో, తెలుగు రాష్ట్రాల్లో పెద్ది షోలు పడ్డాయి. దీంతో ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్, సినిమా లవర్స్ పెద్ది సినిమా చూసి తమ అభిప్రాయాలను ట్విట్టర్ లో పంచుకుంటున్నారు.

 

Also Read : Peddi Review : ‘పెద్ది’ మూవీ రివ్యూ.. రామ్ చరణ్ ఏడిపించేశాడుగా.. చరణ్ ధైర్యానికి హ్యాట్సాఫ్..

పెద్ది సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది అంటున్నారు. కొన్ని సీన్స్ లో ఏడ్చేస్తారని కూడా అంటున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ విజువల్స్, ఏఆర్ రహమాన్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోశాయని అంటున్నారు. జాన్వీ కపూర్ సీన్స్ మాత్రం బాగోలేవని అంటున్నారు. సినిమా అయితే సాధారణ ప్రేక్షకులకు నచ్చేస్తుంది అంటున్నారు.