Ram Charan : రామ్ చరణ్ సినిమాలో నటించాలని అనుకుంటున్నారా..? అయితే ఈ అవకాశం వదులుకోకండి..
RC16 కోసం ఉత్తరాంధ్ర స్లాంగ్ మాట్లాడేవారు కావాలంటా. మీరు ఆ స్లాంగ్ మాట్లాడతారా.. అయితే ఈ కండిషన్స్ ఫాలో అవుతూ ఒక వీడియో చేసి మూవీ టీంకి సెండ్ చేయండి.
- gum 95921
- Updated on- December 8, 2023 / 12:32 PM IST
Ram Charan RC16 movie team audition call for UTTARANDHRA SLANG actors
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 చేయబోతున్న సంగతి తెలిసిందే. వ్రిద్ది సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ మూవీ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా ఈ మూవీలో నటించేందుకు నటీనటులు కావాలంటూ మేకర్స్ ఆడిషన్ కాల్ రిలీజ్ చేశారు. అందుకోసం కొన్ని కండిషన్స్ కూడా ఇచ్చారు. అవేంటో ఒక లుక్ వేసేయండి.
ఈ సినిమా ఉత్తరాంధ్ర ప్రాంతాలు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి నేపథ్యంలో జరగనుంది. దీంతో ఉత్తరాంధ్ర స్లాంగ్ మాట్లాడే నటీనటులు కావాలంటూ మేకర్స్ ప్రకటించారు. ఆసక్తి ఉన్నవారు ఒక నిమిషం ఉత్తరాంధ్ర స్లాంగ్ తో మాట్లాడుతూ యాక్ట్ చేసిన వీడియోని తమకి పంపాలంటూ మెయిల్ ఐడి ఇచ్చారు. రీల్స్, సెల్ఫీ వీడియోలు పంపకూడదని వెల్లడించారు. అలాగే మూడు ఫోటోలు, డీటెయిల్స్ కూడా మెయిల్ లో తెలియజేయాలని పేర్కొన్నారు. మరి రామ్ చరణ్ సినిమాలో మీరు కూడా భాగం కావాలి అనుకుంటే.. వెంటనే మీ టాలెంట్ చూపిస్తూ ఒక వీడియో చేసి సెండ్ చేసేయండి.
Also read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌తో సురేందర్ రెడ్డి సినిమా అలా ఉంటుంది.. వక్కంతం వంశీ కామెంట్స్
ఇక ఈ సినిమా వర్క్స్ ఎప్పుడు మొదలవుతాయి అని ఎదురు చూస్తున్న చరణ్ అభిమానులకు.. ఈ వార్త ఫుల్ జోష్ ని ఇస్తుంది. ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ మూవీలోని ఒక ముఖ్య పాత్ర కోసం విజయ్ సేతుపతిని సెలెక్ట్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక రామ్ చరణ్ కి హీరోయిన్ గా సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త హల్‌చల్ చేస్తుంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు.
