Ram charan- Upasana: రామ్ చరణ్-ఉపాసన కవలల పేర్లు ఇవే.. ఆ పేర్లకు అర్థం ఇదే
రామ్ చరణ్- ఉపాసన(Ram charan- Upasana) తమ కవల పిలల్ల పేర్లను ప్రకటించారు.
- V Santhosh Kumar
- Published On : February 13, 2026 / 07:30 AM IST
Ram Charan Reveals Their Twins Names Sn
Ram charan- Upasana: రామ్‌చరణ్, ఉపాసన దంపతులు జనవరి 31న కవల పిల్లకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలోనే ఫిబ్రవరి 11న కవలలకు బారసాల వేడుకను కూడా జరిపించారు. నామకరణం కూడా జరిగిందట. ఈ వేడుక అతి కొద్ది మంది కుటుంబసభ్యుల మధ్య జరిగిందని తెలుస్తోంది. తాజాగా ఇదే విషశాన్ని అధికారికంగా ప్రకటించాడు మెగాస్టార్ చిరంజీవి. అలాగే కవల పిలల్ల పేర్లను కూడా అధికారికంగా ప్రకటించారు.
వారిలో అబ్బాయికి శివరామ్ అని, అమ్మాయికి అన్విరా దేవి అని నామకరణం(Ram charan- Upasana) చేసినట్లు ఆయన వెల్లడించారు. చిరంజీవి అసలు పేరు ‘శివ శంకర వరప్రసాద్’ నుంచి శివ.. రామ్ చరణ్ పేరు నుంచి రామ్ కలగలిసి ఉండేలా శివరామ్ అని పేరు ఉందని మెగాస్టార్ తెలిపారు. ఇక కుమార్తె పేరు ‘అన్విరా దేవి’కి అపరిమితమైన ధైర్యం, దైవికమైన స్త్రీ శక్తి అని అర్థం వచ్చేలా పెట్టామని ఆయన తెలిపారు. దీంతో, ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
Couple Friendly Pre Valentine Party: కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రీ వాలెంటైన్ పార్టీ.. ఫొటోలు వైరల్
