Ram Charan : సల్మాన్ అండ్ వెంకీ మామతో చరణ్ మాస్ స్టెప్పులు అదరగొట్టేశాడుగా..
సల్మాన్ ఖాన్ (Salman Khan) కిసీకా భాయ్ కిసీకా జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) కామేమో అపిరెన్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన సాంగ్ ని రిలీజ్ చేశారు.
- gum 95921
- Published On : April 4, 2023 / 01:03 PM IST
Ram Charan Salman Khan Venkatesh mass steps in Kisi Ka Bhai Kisi Ki Jaan - Pic Source Twitter
Ram Charan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్న తాజా చిత్రం కిసీకా భాయ్ కిసీకా జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan). తమిళంలో సూపర్ హిట్ అయిన వీరం సినిమాకి ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది. తెలుగులో ఈ సినిమాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాటమరాయుడు పేరుతో రీమేక్ చేశాడు. ఇప్పుడు బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఈ రీమేక్ లో ఆల్మోస్ట్ ప్రధాన పాత్రలు అన్ని టాలీవుడ్ స్టార్స్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ (Venkatesh), పూజా హెగ్డే (Pooja Hegde), జగపతి బాబు నటిస్తున్నారు.
Dasara : దసరా బ్లాక్ బాస్టర్ పార్టీ.. దావత్ పెడుతున్న నాని..
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఈ సినిమాలోని ఒక పాటలో కామేమో అపిరెన్స్ ఇస్తున్నట్లు తెలిసిందే. తాజాగా ఈ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఉత్సవం బ్యాక్ డ్రాప్ తో సాగుతున్న పాటలో వెంకీ అండ్ సల్మాన్ కలిసి స్టెప్పులు వేస్తుండగా పాట చివరిలో చరణ్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేశాడు. సల్మాన్ అండ్ వెంకీ మామతో కలిసి లుంగీతో చరణ్ మాస్ స్టెప్పులు వేశాడు. ఇక ముగ్గురు సూపర్ స్టార్స్ ని ఒకే ఫ్రేమ్ లో చూస్తుంటే.. రేపు థియేటర్‌లు ఈ సాంగ్ కి దద్దరిల్లిపోవడం ఖాయం అన్నట్లుంది.
Upasana : సమాజం కోరుకున్నప్పుడు కాదు నేను కావాలనుకున్నప్పుడు తల్లినవుతున్నాను..
కాగా ఈ పాట షూటింగ్ మొత్తం ఆచార్య సినిమా కోసం వేసిన టెంపుల్ సెట్ లో జరిగింది. కాటమరాయుడు కథ అందరికి గుర్తు ఉండే ఉంటది. అందులో పవన్ కళ్యాణ్, శృతిహాసన్ కోసం ఆమె ఊరుకి వస్తాడు. ఇప్పుడు ఈ సినిమాలో సల్మాన్, పూజా హెగ్డే కోసం తెలంగాణలోని ఒక ఊరుకి వస్తాడు. తెలంగాణ నేటివిటీని చూపిస్తూ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ క్రమంలోనే బతుకమ్మ సంప్రదాయాన్ని చూపిస్తూ ఒక సాంగ్ ని కూడా చిత్రీకరించారు. వెంకటేష్, పూజా హెగ్డేకి అన్నయ్య పాత్రలో కనిపిస్తున్నాడు.
