Ram Charan – Manchu Manoj : మంచు మనోజ్‌కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన రామ్ చరణ్.. ఏంటో తెలుసా?
ఇటీవల పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ అండ్ భూమా మౌనికలకు రామ్ చరణ్ (Ram Charan) స్పెషల్ గిఫ్ట్ పంపించాడు. అది చూసిన నెటిజెన్లు స్వీట్ గిఫ్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
- gum 95921
- Published on- April 10, 2023 / 01:39 PM IST
Ram Charan send a special gift for Manchu Manoj and Bhuma Mounika Reddy
Ram Charan – Manchu Manoj : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), మంచు మనోజ్ (Manchu Manoj) మంచి మిత్రులు అని అందరికి తెలిసిందే. కాగా ఇటీవల మనోజ్.. భూమా మౌనిక రెడ్డి ని (Bhuma Mounika Reddy) వివాహం చేసుకున్నాడు. మనోజ్ అండ్ మౌనికలకు రెండో వివాహం కావడంతో ఎటువంటి హడావుడి లేకుండా చాలా సింపుల్ గా మ్యారేజ్ చేసున్నారు. దీంతో ఈ వివాహానికి రామ్ చరణ్ హాజరు కాలేదు. అయితే ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ ని ఉపాసన గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పార్టీకి మనోజ్ తన భార్యతో కలిసి వెళ్లి చరణ్ ని కలిశాడు.
Ram Charan – Upasana : మాల్దీవ్ వెకేషన్‌కు వెళ్లిన రామ్‌చరణ్ అండ్ ఉపాసన..
ఇక తాజాగా రామ్ చరణ్, మనోజ్ కి ఒక స్పెషల్ గిఫ్ట్ పంపించాడు. ఆ గిఫ్ట్ ని షేర్ చేస్తూ మనోజ్ ట్వీట్ చేశాడు. ”స్వీట్ కపుల్ రామ్ చరణ్ అండ్ ఉపాసన నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్స్. మీ ప్రేమకు థాంక్యూ మిస్టర్ అండ్ మిసెస్ మిత్రమా. మాల్దీవ్స్ నుంచి మీ రాక కోసం ఎదురు చూస్తుంటా. బాగా ఎంజాయ్ చేసి రండి” అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఆ గిఫ్ట్ ఎలా ఉంది అంటే.. కొత్తగా పెళ్ళైన జంట ముందు పెట్టుకోబోతున్న దృశ్యం కనిపిస్తుంది. ఇక ఈ ట్వీట్ చూసిన నెటిజెన్లు స్వీట్ గిఫ్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Ram Charan : రామ్ చరణ్ సినిమాకి ఎ ఆర్ రెహమాన్ సంగీతం.. ఏ సినిమా తెలుసా?
కాగా రామ్ చరణ్ అండ్ ఉపాసన ఇటీవలే దుబాయ్ వెకేషన్ నుంచి తిరిగి వచ్చి, మళ్ళీ మరో వెకేషన్ కి మాల్దీవ్స్ కి వెళ్లారు. ఈ వెకేషన్ పూర్తి అవ్వగానే చరణ్ గేమ్ చెంజర్ (Game Changer) షూటింగ్ లో పాల్గొనున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తుంది.
