RC 17 : ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. నెమలి పింఛంతో రామ్ చరణ్.. సుక్కు బ్యాక్ టు లవ్ స్టోరీ..?

నేడు ఈ సినిమా అధికారికంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంది. (RC 17)

  • Updated on- November 1, 2026 / 04:44 PM IST

RC17

RC 17 : మెగా ఫ్యాన్స్, టాలీవుడ్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా RC17. సుకుమార్ – రామ్ చరణ్ కాంబోలో రంగస్థలం తర్వాత ఈ సినిమా వస్తుండటం, చరణ్ గేమ్ చెంజర్ ఫ్లాప్, పెద్ది హిట్ అయినా ఊహించినంత విజయం అందుకోకపోవడంతో చరణ్ – సుక్కు కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నేడు ఈ సినిమా అధికారికంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంది. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. నేడు ఓపెనింగ్ కి మెగాస్టార్ గెస్ట్ గా వచ్చి క్లాప్ కొట్టారు. దీంతో ఓపెనింగ్ జరిగింది అని మెగా ఫ్యాన్స్ సంతోషించేలోపే ఈ హ్యాపినెస్ ని డబల్ చేసారు దర్శకుడు సుకుమార్. ఈ సినిమా నుంచి అధికారికంగా ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.

Also See : RC 17 Ram Charan: ఆర్‌సీ17 పూజా కార్య‌క్ర‌మం.. ముఖ్య అతిథిగా మెగాస్టార్‌.. ఫోటోలు వైర‌ల్..

ఈ పోస్టర్ లో నీలం రంగులో నెమలి పింఛం, ఆ పింఛంతో పాటు రామ్ చరణ్ ఫేస్ అదే డిజైన్ లో కనిపించేలా ఉంది. ఈ పోస్టర్ చాలా ఆసక్తిగా, క్లాసిక్ గా ఉంది. ఈ నెమలి పింఛం, చరణ్ ఫేస్ కలిపి లవ్ సింబల్ లో హాఫ్ సింబల్ గా కనిపిస్తుంది. ఇంకో హాఫ్ సింబల్ హీరోయిన్ తో తర్వాత రిలీజ్ చేస్తారా అనే ఆసక్తి కూడా నెలకొంది. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారగా ఈ సినిమా జానర్ పై చర్చ జరుగుతుంది. సుకుమార్ మళ్ళీ తనకు బాగా నచ్చిన లవ్ జానర్ కి తిరిగొస్తున్నాడు అని అంటున్నారు. ఈ పోస్టర్ తో రామ్ చరణ్ – సుకుమార్ తీసేది లవ్ జానర్ అని, కృషుడి క్యారెక్టర్ కి దగ్గరగా ఉండేలా చరణ్ పాత్ర ఉంటుందని భావిస్తున్నారు.

సుకుమార్ తీసిన ఆర్య, 100% లవ్, ఆర్య 2 సినిమాలో లవ్ జానర్ లో వచ్చి మంచి విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుకుమార్ తన మైండ్ కి పని చెప్పే సినిమాలు, పుష్ప తో మాస్ సినిమాలు తీసినా ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చరణ్ తో లవ్ స్టోరీ ఉంటుందని తెలుస్తుంది. లవ్ స్టోరీ తో పాటు యాక్షన్ కూడా ఉంటుందని టాక్. RC17 సినిమాకు రిలీజ్ కి ముందే హైప్ ఉండగా ఓపెనింగ్ రోజే పోస్టర్ రిలీజ్ చేసి మరింత ఆసక్తిని పెంచారు సినిమాపై.