Ram Charan : RC17 అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది.. బాక్సాఫీస్‌ని కొల్లగొట్టడానికి మరోసారి..
బాక్సాఫీస్‌ని కొల్లగొట్టడానికి మరోసారి 'రంగస్థలం' కాంబో వచ్చేస్తుంది. RC17 అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది..
- gum 95921
- Updated on- March 25, 2024 / 03:36 PM IST
Ram Charan Sukumar RC17 movie official update is here
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా ఒక టర్నింగ్ పాయింట్ గా రంగస్థలం నిలిచింది. చరణ్ పై వస్తున్న విమర్శలకు ఆ చిత్రం గట్టి సమాధానం ఇచ్చింది. ఆ సినిమాతో మెగా ఫ్యాన్స్ కి ఎప్పటికి మర్చిపోలేని ట్రీట్ ఇచ్చిన రామ్ చరణ్, సుకుమార్ మళ్ళీ కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులంతా ఆశ పడుతున్నారు. ఆ తరుణం వచ్చేసింది.
కేవలం హీరో దర్శకుడు మాత్రమే కాదు. రంగస్థలంకి పని చేసిన నిర్మాతలు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నారు. నేడు హోలీ పండుగ సందర్భంగా ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకుడిగా రామ్ చరణ్ హీరోగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేయనున్నారట. 2025లో రిలీజ్ చేసేలా షూటింగ్ పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
Also read : Om Bheem Bush Collections : ‘ఓం భీమ్ బుష్’ మంత్రం బాగా పనిచేస్తుంది.. రోజురోజుకి కలెక్షన్స్ పెరుగుతూ..
కాగా రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. మే నెలతో ఈ మూవీ షూటింగ్ పూర్తి అవుతుందని సమాచారం. ఆ వెంటనే RC16 షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారు. ఇక పుష్ప 2తో బిజీగా ఉన్న సుకుమార్ సెప్టెంబర్ తో ఫ్రీ అవుతారు. ఆ తరువాతే RC17ని స్టార్ట్ చేసి RC16తో పాటు షూటింగ్ జరుపుకుంటూ ముందుకు తీసుకు వెళ్లనున్నారని తెలుస్తుంది.
