Om Bheem Bush Collections : ‘ఓం భీమ్ బుష్’ మంత్రం బాగా పనిచేస్తుంది.. రోజురోజుకి కలెక్షన్స్ పెరుగుతూ..

‘ఓం భీమ్ బుష్’ మంత్రం బాగా పనిచేస్తుంది. రోజురోజుకి కలెక్షన్ పెరుగుతూ బాక్స్ ఆఫీస్ వద్ద..

Om Bheem Bush Collections : ‘ఓం భీమ్ బుష్’ మంత్రం బాగా పనిచేస్తుంది.. రోజురోజుకి కలెక్షన్స్ పెరుగుతూ..

Sree Vishnu Om Bheem Bush Three Days Collections Full Details Here

Updated On : March 25, 2024 / 2:40 PM IST

Om Bheem Bush Collections : టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ కామెడీ ట్రైయో హీరో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.. మరోసారి ఆడియన్స్ కి గిలింతలు పెట్టడానికి తీసుకు వచ్చిన సినిమా ‘ఓం భీమ్ బుష్’. హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ ఫిమేల్ లీడ్స్ లో నటించారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం మార్చ్ 22న మంచి బజ్ తో రిలీజ్ అయింది.

ట్రైలర్ అండ్ టీజర్ లో కామెడీ ఎలిమెంట్స్ మాత్రమే చూపించిన మేకర్స్.. థియేటర్ కి వెళ్లిన తరువాత హార్రర్ ఎలిమెంట్స్ ని కూడా చూపిస్తూ భయపెట్టారు. ఇక ఈ సర్‌ప్రైజ్ తో ఆడియన్స్ కి మూవీ బాగా నచ్చేసింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ కనిపించడంతో.. థియేటర్స్ కి ప్రేక్షకులు క్యూ కట్టారు. మొదటి రోజు 4.6 కోట్ల గ్రాస్ ని అందుకున్న ఈ మూవీ.. రెండో రోజు 5 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని మొత్తం మీద రూ.10.44 కోట్ల గ్రాస్ ని నమోదు చేసింది.

Also read : Family Star : ఫ్యాన్స్‌తో విజయ్, మృణాల్ హోలీ సెలబ్రేషన్స్.. డాన్స్ వీడియో వైరల్..

ఇక మూడోరోజు సండే నాడు మొదటి రెండు రోజులు కంటే ఎక్కువుగా 6 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. దీంతో మొదటి వీకెండ్ పూర్తి అయ్యేపాటికీ ఈ చిత్రం రూ.17 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది. అటు ఓవర్‌సీస్ లో కూడా 250K డాలర్స్ పైగా వసూలు రాబట్టి 1M వైపు పరుగులు పెడుతుంది. కాగా శ్రీవిష్ణు గత చిత్రం ‘సమజవరగమన’ రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని శ్రీవిష్ణు కెరీర్ హైయెస్ట్ గా నిలిచింది.

 

View this post on Instagram

 

A post shared by Sree Vishnu (@sreevishnu29)

మరి ‘ఓం భీమ్ బుష్’ ఆ మార్క్ ని క్రాస్ చేసి శ్రీవిష్ణు మరింత ముందుకు తీసుకు వెళ్తుందా లేదా చూడాలి. కాగా ఈ మూవీ దాదాపు 8 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు సమాచారం. అంటే ఈ చిత్రం 18 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ సాధించినట్లే. ప్రస్తుతం ఉన్న కలెక్షన్స్ బట్టి చూస్తే.. ఈ చిత్రం మరో కోటి రాబడితే బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే.