Ram Charan : ఆ సినిమా ఆగిపోయినందుకు బాధపడ్డా.. 15 ఏళ్ళ తర్వాత నా కల నెరవేరింది.. చరణ్ కామెంట్స్ వైరల్..

ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు చరణ్. (Ram Charan)

  • Updated on- May 21, 2026 / 02:55 PM IST

Ram Charan

Ram Charan : రామ్ చరణ్ పెద్ది సినిమాతో జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో చరణ్ మూడు గేమ్స్ ఆడుతూ క్రాస్ ఓవర్ అథ్లెట్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ – బుచ్చిబాబు కలిసి కార్ డ్రైవ్ చేస్తూ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు చరణ్.

ఈ క్రమంలో.. స్పోర్ట్స్ మీద సినిమా చేయాలి అని ఎప్పట్నుంచో అనుకున్నా. మెరుపు సినిమా స్పోర్ట్స్ కథ. కానీ అప్పుడున్న టెక్నాలజీకి స్పోర్ట్స్ ని అంతా బాగా చూపించలేక ఆ సినిమా ఆగిపోయింది. ఆ సినిమా ఆగిపోయినప్పుడు బాధపడ్డాను. మెరుపు స్పోర్ట్స్ సినిమాగా చేయాలి అనుకున్నాను కానీ అవ్వలేదు. అప్పట్నుంచి ఒక స్పోర్ట్స్ డ్రామా చేయాలి అని అనుకుంటూనే ఉన్నాను. అలా మిగిలిపోయిన కోరిక ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత నెరవేరింది అని అన్నారు.

Also Read : Bandla Ganesh : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పవర్ స్టార్ తో బండ్లన్న.. వీడియోలు వైరల్..

2011 లో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా మెరుపు అనే సినిమా ప్రారంభమైంది. సినిమా ఓపెనింగ్ చేసి, 15 రోజులు షూట్ కూడా చేసారు. RB చౌదరి నిర్మాణంలో ధరణి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కాలి. కానీ అప్పుడు ఆ సినిమాలో అనుకున్న స్పోర్ట్ ని గొప్పగా చూపించే సాంకేతికత అందుబాటులో లేక, బడ్జెట్ కూడా ఎక్కువ అవ్వడంతో ఆ సినిమా ఆగిపోయింది. మొత్తానికి చరణ్ స్పోర్ట్స్ సినిమా కల ఇప్పుడు పెద్దితో తీరింది.

చరణ్ – బుచ్చిబాబు ఫుల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..