×
Ad

Ram Charan – Upasana : బిడ్డ పుట్టాక పూర్తి బాధ్యత చిరంజీవిదే అంటున్న ఉపాసన.. అత్తమామల దగ్గరకు షిఫ్ట్‌!

రామ్ చరణ్ అండ్ ఉపాసన త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. కాగా వీరికి పుట్టబోయే బిడ్డ పూర్తి బాధ్యతని చిరంజీవికి ఇచ్చేస్తున్నట్లు ఉపాసన తెలియజేసింది.

  • Published On : June 16, 2023 / 07:12 AM IST

Ram Charan Upasana said her baby full responsibility is to Chiranjeevi

Ram Charan – Upasana : మెగా కపుల్ రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. పెళ్ళైన 10 ఏళ్ళ తరువాత వీరిద్దరూ తమ మొదటి బేబీకి ఆహ్వానం పలుకుతున్నారు. గత ఏడాది డిసెంబర్ లో మెగా వారసత్వం గురించి చిరంజీవి (Chiranjeevi) శుభవార్త చెప్పి మెగా అభిమానులను ఖుషీ చేశాడు. ఇక ఉపాసన డెలివరీ డేట్ ఆగష్టు నెలలో ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో మెగా అభిమానుల్లో పండుగా వాతావరణం కనిపిస్తుంది. మెగా వారసుడు? మెగా వారసురాలు? అని అందరిలో ఆసక్తి నెలకుంది.

Ram Charan : ఉపాసన ప్రెగ్నెన్సీ విషయం చెప్పగా.. చరణ్ రియాక్షన్ మీరు ఉహించి ఉండరు.. అదేంటో తెలుసా?

కాగా ఇటీవల చరణ్ అండ్ ఉపాసన తన 11 ఏళ్ళ పెళ్లి జీవితాన్ని పూర్తి చేసుకోవడంతో ఒక ఆంగ్ల మీడియా ఉపాసనని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఉపాసన తన పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుతూ.. “పిల్లలు పుట్టాక చాలామంది దంపతులు వేరు కాపురం పెట్టడానికి చూస్తుంటారు. కానీ చరణ్ అండ్ నేను దానికి పూర్తి భిన్నం. ప్రస్తుతం మేము అత్తమామలు (చిరంజీవి-సురేఖ) విడివిడిగా ఉంటున్నాము. కానీ బిడ్డ పుట్టిన తరువాత అత్తమామల దగ్గరకి షిఫ్ట్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే మా ఇద్దరి ఎదుగుదలలో మా గ్రాండ్‌ పేరంట్స్‌ చాలా కీలకపాత్ర పోషించారు. వారి నుంచి మేము చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నాము. అలాగే మాకు పుట్టబోయే బిడ్డ కూడా గ్రాండ్‌ పేరంట్స్‌ దగ్గరే పెరగాలి అనుకుంటున్నాము” అంటూ చెప్పుకొచ్చింది.

Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందో తెలుసా..?

ఇక మెగా బేబీ డ్యూటీ మొత్తం మెగాస్టార్ అండర్ లోకి వెళ్లబోతుంది. అలాగే చరణ్ కూడా బిడ్డ పుట్టిన తరువాత కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చెంజర్ (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఆగష్టు లేదా సెప్టెంబర్ లో పూర్తి అవ్వనుంది.