చరణ్‌తో ‘మనం’ దర్శకుడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందని సమాచారం..

  • Publish Date - February 25, 2020 / 09:41 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందని సమాచారం..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తర్వాతి సినిమాకు రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ సమాచారం. చెర్రీ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్‌’లో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. తన పార్ట్ దాదాపు పూర్తవడంతో తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టాడు.

ఇప్పటికే కొన్ని కథలు విన్నాడని తెలుస్తోంది. ‘13బి’, ‘ఇష్క్’, ‘మనం’, ‘24’, ‘హలో’, ‘గ్యాంగ్ లీడర్’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న టాలెంటెండ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ కూడా రామ్ చరణ్‌కు ఓ కథ వినిపించారట. కథ విని రామ్ చరణ్ వెంటనే ఓకే చెప్పాడట.

కథ బాగా నచ్చడంతో విక్రమ్‌ను ప్రశంసించాడని, ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ అయిపోయేలోపు పూర్తి కథను సిద్ధం చేయాలని విక్రమ్‌కు చెప్పాడట చరణ్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే యోచనలో ఉందట. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్ వినిపిస్తోంది.