×
Ad

RRR Movie : మొదలైన రామ్ చరణ్ బర్త్ డే మేనియా, ఆర్ఆర్ఆర్ మూవీ..ఫ్యాన్స్ కు కానుక

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ బర్త్ డే సెలబ్రేషన్స్ అప్పుడే మొదలయ్యాయి.

  • Published On : March 26, 2021 / 02:28 PM IST

Ram Charans Birthday Special Fiery New Look Of Alluri Sitarama Raju1

Ram Charan’s Birthday : మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ బర్త్ డే సెలబ్రేషన్స్ అప్పుడే మొదలయ్యాయి.2021, మార్చి 27వ తేదీ శనివారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో చెర్రీ పోస్టులను తెగ పోస్టులు చేస్తున్నారు. తమ అభిమాన నటుడికి బర్త్ డే విషెష్ వినూత్నంగా తెలియచేస్తున్నారు. చెర్రీ న్యూ ఫిల్మ్ RRR సినిమా పోస్టర్లు, స్టిల్స్ చేసుకుంటూ..ముందస్తుగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. తాజాగా..ఫ్యాన్స్ కు ఫుల్ ఖుష్ అయ్యే సమాచారం వెలువడింది. చెర్రీ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ మేరకు RRR Movie ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.

తొందరగా సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయని, కొత్త అవతారంలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడని, RRR మూవీలోని రామరాజు లుక్ ..2021, మార్చి 26వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నామని ట్వీట్ చేయడంతో అభిమానులు సంబర పడిపోతున్నారు. మరోవైపు..చెర్రీ బర్త్ డే సందర్భంగా..సాయి ధరమ్ తేజ రిలీజ్ చేసిన కామన్ డీపీపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వారిని కూల్ చేసేందుకు మెగా హీరో వరుణ్ తేజ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. నిప్పుల మధ్య నుంచి దూకుతున్నట్లు కనిపించాడు. RRR మూవీలో నిప్పుకు ప్రతీకగా చెర్రీని చూపించడంతో…మోషన్ పోస్టర్ లో కూడా…నిప్పునే మెయిన్ గా ఎంచుకున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘RRR- రౌద్రం రణం రుధిరం’..అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, ఒలీవియా మోరీస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ, శ్రియ వంటి భారీ తారాగణంతో అత్యంత భారీగా తెరకెక్కుతోంది. దసరా కానుకగా ఈ ఏడాది అక్టోబర్ 13 న ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కానుంది.