RGV – JD : ఒకే అమ్మాయిని ప్రేమించి.. పెళ్లి ప్రొపోజల్ పెట్టిన గురుశిష్యులు..
తన ప్రత్యేక వైఖరితో వర్మ ఎలా ఉంటాడో.. అతని శిష్యులు కూడా అదే వైఖరితో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక జె డి చక్రవర్తి, వర్మ మధ్య సంబంధం విషయానికి వస్తే..
- gum 95921
- Published On : August 4, 2023 / 03:21 PM IST
Ram Gopal Varma and J D Chakravarthy love on Sridevi
RGV – J D Chakravarthy : సినీ పరిశ్రమలో రామ్ గోపాల వర్మ (Ram Gopal Varma) అతని శిష్యులు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ప్రత్యేక వైఖరితో వర్మ ఎలా ఉంటాడో.. అతని శిష్యులు కృష్ణవంశీ, తేజ, పూరీ, జె డి చక్రవర్తి ఇలా ప్రతి ఒక్కరు అదే వైఖరితో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక జె డి చక్రవర్తి, వర్మ మధ్య సంబంధం విషయానికి వస్తే.. గురుశిష్యులు బంధకంటే మరో విషయం వీరిద్దర్నీ చాలా దగ్గర చేసింది. ఆ విషయమే ఒక అమ్మాయి మీద ప్రేమ.
Baby Movie : బేబీ మూవీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. నాలుగు గంటల సినిమా ఓటీటీలో..?
వీరిద్దరూ ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించారు అనడం కంటే ఆరాధించారు అనే చెప్పాలి. ఆమె ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఆమె మరోవ్యక్తికి మనసు ఇచ్చి మనువాడింది. అయినా సరే ఆమె పై వీరిద్దరి ప్రేమ ఇంచు కూడా తగ్గలేదు. ఇప్పటికే కూడా ఆమెను ప్రేమిస్తూనే ఉన్నారు. ఇంతకీ ఆమె ఎవరు అని ఆలోచిస్తున్నారా..? ఆమె మరెవరో కాదు. మనందరి అతిలోకసుందరి శ్రీదేవి. ఆర్జీవీ, జె డి కలిసి కూర్చున్నారు అంటే.. వారిద్దరికీ మరో టాపిక్ ఉండదట. గంటల, రోజులు తరబడి ఆమె గురించే మాట్లాడుకుంటూ ఉంటారు.
Pawan Kalyan – Trivikram : పవన్ కళ్యాణ్ వర్సెస్ త్రివిక్రమ్.. సంక్రాంతికి స్నేహితుల మధ్య ఫైట్..?
ఇక వీరిద్దరూ ఫేవరెట్ సినిమాలు కూడా ఆమె నటించనవే. సినిమా ఎంత చెత్తగా ఉన్నా, ఆమె పక్కన ఎంత పెద్ద స్టార్ ఉన్నా ఆర్జీవీ, జె డి చూపు మాత్రం ఆమె పైనే ఉండేదట. ఈ పిచ్చి ప్రేమతోనే ఆమెను పెళ్లి కూడా చేసుకుందాం అని అనుకున్నారట. ఈ క్రమంలోనే జె డి.. క్షణం క్షణం సినిమా సమయంలో శ్రీదేవికి పెళ్లి ప్రొపోజల్ కూడా చేసినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక వర్మ విషయానికి వస్తే.. అప్పలరాజు మూవీ ఓపెనింగ్ సమయంలో శ్రీదేవి తన భర్త బోనీ కపూర్ తో సహా వచ్చింది. అప్పుడు బోనీ కపూర్ ముందే వర్మ శ్రీదేవితో.. “నిన్ను నేను పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాను. కానీ నువ్వు బోనీ చేసేసుకున్నావు” అంటూ బహిరంగంగా చెప్పాడు.
