×
Ad

Ram Gopal Varma : సీఎం జగన్‌తో RGV భేటీ.. గంటకు పైగా జరిగిన చర్చ.. వ్యూహం సినిమాకు..

సీఎం జగన్‌తో భేటీ అయిన రామ్ గోపాల్ వర్మ. అమరావతిలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ తో దాదాపు గంటకు పైగా RGV భేటీ అయ్యాడు. ఈ భేటీలో..

  • Published On : June 19, 2023 / 07:06 PM IST

Ram Gopal Varma meets YS Jagan Mohan Reddy on point of Vyooham movie

Ram Gopal Varma Vyooham : రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ అంశాలు పై సినిమా తియ్యబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ‘వ్యూహం’, ‘శపథం’ అనే టైటిల్స్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ని కూడా మొదలు పెట్టాడు. అప్పటి నుంచి షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ వచ్చాడు.

Adipurush : ఆదిపురుష్ సినిమాలో ఆక్వామ్యాన్ అంటూ నెటిజెన్స్ ట్రోల్స్.. మీరు గమనించారా..?

ఈ క్రమంలోనే మూవీలోని సీఎం జగన్ (YS Jagan Mohan Reddy), వైఎస్ భారతి (Y S Bharati), నారా చంద్రబాబు నాయుడు (N Chandrababu Naidu) పాత్రలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇక తాజాగా ఈ దర్శకుడు.. జగన్ ని అమరావతిలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశాడు. జగన్ తో దాదాపు గంటకు పైగా RGV భేటీ అయ్యాడు. ఈ భేటీలో వ్యూహం సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చూపించినట్లు సమాచారం.

Ram Charan : రామ్ చరణ్‌కి పుట్టబోయే బిడ్డ కోసం కీరవాణి కొడుకు స్పెషల్ ట్యూన్.. ఉపాసన ట్వీట్!

కాగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమాలో జగన్ పాత్రని ‘అజ్మల్ అమీర్’ పోషిస్తున్నాడు. వైఎస్ భారతి రోల్ లో మానస రాధా కృషన్ కనిపించబోతుంది. ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనే దాని పై ఇంకా క్లారిటీ రాలేదు. గతంలో వర్మతో వంగవీటి సినిమా తెరకెక్కించిన దాసరి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గత ఎన్నికల సమయంలో ‘లక్ష్మిస్ ఎన్టీఆర్’తో ఆడియన్స్ ని పలకరించిన వర్మ.. ఈసారి ‘వ్యూహం’, ‘శపథం’ చిత్రాలతో ప్రేకక్షుల ముందుకు రాబోతున్నాడు.

Ram Gopal Varma meets YS Jagan Mohan Reddy on point of Vyooham movie

Ram Gopal Varma meets YS Jagan Mohan Reddy on point of Vyooham movie

Ram Gopal Varma meets YS Jagan Mohan Reddy on point of Vyooham movie