Rangeela: వారసుడి కోసం వర్మ సాహసం.. ‘రంగీలా’ రీమేక్‌తో బాక్సాఫీస్ వద్ద పాత ఫామ్ అందుకుంటారా?

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రంగీలా(Rangeela) సినిమాను తెలుగులో రీమేక్ చేసే ప్లాన్ లో ఉన్న రామ్ గోపాల్ వర్మ.

Ram Gopal Varma planning to remake Rangeela movie in Telugu.

  • రంగీలా తెలుగులో రీమేక్ చేస్తున్న వర్మ
  • నిర్మాత కొడుకు కూడా ఎంట్రీ
  • త్వరలోనే అధికారిక ప్రకటన

Rangeela: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రంగీలా(Rangeela)’ భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. 1995లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏఆర్ రెహమాన్ సంగీతం, ఊర్మిళా మటోండ్కర్ గ్లామర్, అమీర్ ఖాన్ అద్భుత నటన ఈ సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టాయి. ముంబై వీధుల్లో తిరిగే ఒక సామాన్య యువకుడు, సినిమా స్టార్ కావాలని కలలుగనే అమ్మాయి మధ్య సాగే ఈ ప్రేమకథ అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుంది.

Anil- Venkatesh: మొన్న చిరంజీవి.. ఇప్పుడు వెంకటేష్.. పెళ్ళైన హీరోయిన్స్ నే ఫిక్స్ చేస్తున్న అనిల్

ఇప్పుడు దాదాపు 31 ఏళ్ల తర్వాత, అదే మ్యాజిక్‌ను మళ్లీ వెండితెరపై పునరావృతం చేసేందుకు ఆర్జీవీ సిద్ధమవుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, తెలుగులో ఒక స్టార్ ప్రొడ్యూసర్ తన కుమారుడిని హీరోగా పరిచయం చేసే బాధ్యతను ఆర్జీవీకి అప్పగించాడట. అందుకోసం ‘రంగీలా’ కథను రీమేక్ చేస్తే బాగుంటుందని వర్మ భావిస్తున్నారట. అయితే ఈసారి ఆయన నేరుగా కాకుండా తన పర్యవేక్షణలో తన శిష్యుడిని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడట.

ప్రెజెంట్ జనరేషన్ కి తగ్గట్టుగా ఒరిజినల్ కథలో కొన్ని కీలక మార్పులు చేర్పులు చేసి ఈ రీమేక్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గ్లామర్, ఎమోషన్స్ కలగలిసిన ఈ కథ కొత్త హీరోకు సరైన డెబ్యూ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. అయితే, ఒకప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన మేకింగ్‌తో షేక్ చేసిన రామ్ గోపాల్ వర్మ, గత కొంతకాలంగా తన మార్క్ సక్సెస్‌ ను కంటిన్యూ చేయలేకపోతున్నాడు. ఈ నేపధ్యంలోనే తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన ‘రంగీలా’ను మళ్లీ టచ్ చేయడం అనేది సాహసమనే చెప్పాలి. ఆయన అభిమానులు కూడా వర్మ మళ్లీ తన పాత పంథాలోకి వచ్చి, క్వాలిటీ సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నారు. మరి ఈ మెగా రీమేక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి.