×
Ad

Ram Gopal Varma: కాస్ట్యూమ్ నచ్చక బీచ్ లో.. ఊర్మిళ చేసిన పనికి యూనిట్ అంతా షాక్.. టీ షర్ట్ కూడా..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఏం చేసిన సంచలనమే. ఆయన చేసే సినిమాలు, మాట్లాడే మాటలు, చేసే పనులు.. ఇలా ప్రతీది చాలా ప్రత్యేకం. అందుకే, ఆయన సినిమా వస్తుంది అంటే వివాదాలకు కొదవ ఉండదు.

Ram Gopal Varma reveals interesting facts about Urmila's costume in Rangeela movie

Ram Gopal Varma: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఏం చేసిన సంచలనమే. ఆయన చేసే సినిమాలు, మాట్లాడే మాటలు, చేసే పనులు.. ఇలా ప్రతీది చాలా ప్రత్యేకం. అందుకే, ఆయన సినిమా వస్తుంది అంటే వివాదాలకు కొదవ ఉండదు. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో తెలియదు. తాజాగా ఈ దర్శకుడి మొదటి సినిమా, ఇండియన్ సినిమా పాత్ బ్రేకర్ శివ రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. దీనికి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సీనియర్ హీరోల రీ రిలీజ్ లో ఇదే టాప్ పొజిషల్ లో ఉండటం గమనార్హం.

Sahithi Dasari: మత్తు కళ్ళతో సాహితి.. అందాలు చూస్తే పోతోంది మతి.. ఫోటోలు

ఈ నేపధ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన తెరకెక్కించిన మరో సంచలన మూవీ రంగీలా సినిమా గురించి, హీరోయిన్ ఊర్మిళ గురించి ఆసక్తికర విషయాలు చాలా చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ సినిమా విడుదలై 30 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నా కెరీర్ లో రంగీలా సినిమా చాలా ప్రత్యేకం. ఒకరోజు రంగీలా సినిమాలోని “తనహా తనహా ఎహేపే జీనా” సాంగ్ షూట్ చేయడానికి బీచ్ కి వెళ్ళాం. ఈ పాట చిత్రీకరణ విషయంలో యూనిట్ అంతా ఎగ్జైటింగ్ గా ఉన్నాం. తీరా లొకేషన్ కి వచ్చాక హీరోయిన్ ఊర్మిళకు కాస్ట్యూమ్ డిజైనర్ తెచ్చిన కాస్ట్యూమ్ నచ్చలేదు. దాంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. అది గమనించిన జాకీ ష్రాఫ్ తన టీ షర్ట్ తీసుకొని వచ్చాడు. ఆ టీ షర్ట్ వేసుకొని బీచ్ అంతా పరిగెత్తింది ఊర్మిళా. అది చూసి యూనిట్ అంతా షాక్ అయ్యారు”అంటూ చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. దీంతో వర్మ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక రంగీలా సినిమా విషయానికి వస్తే, 1995లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో అమిర్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఊర్మిళ మాటొడ్కర్ ప్రధాన పాత్రలో నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఒక సంచలనం అనే చెప్పాలి. ఇక ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. యాయీరే.. యాయీరే.. అనే పాట ఇప్పటికే ఎక్కడో చోట వింటూనే ఉంటాం.