RGV: ఈ సినిమా ఒక బెంచ్ మార్క్.. ధురంధర్ 2పై ఆర్జీవీ సంచలన కామెంట్స్
ధురంధర్ 2, ఆదిత్య ధర్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ(RGV).
- V Santhosh Kumar
- Updated on- March 21, 2026 / 09:05 PM IST
Ram Gopal Varma shocking comments on Dhurandhar 2
RGV: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ స్పై యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. మొదటి రోజే రెండు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. దర్శకుడు ఆదిత్య ధర్ తన అద్భుతమైన మేకింగ్‌తో ఈ సీక్వెల్‌ను తొలి భాగం కంటే బెటర్ గా తీర్చిదిద్దారు. ఇక హీరోగా రణవీర్ సింగ్ తన పవర్ ఫుల్ నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇక మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా తమదైన శైలిలో మెప్పించారు.
Sreemukhi: ట్రెండీ లుక్స్ లో యాంకర్ శ్రీముఖి.. ఆరంజ్ కలర్ డ్రెస్సులో ఓ రేంజ్ గ్లామర్.. ఫొటోస్
ఈ చిత్రంపై ఇప్పటికే టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రశంసల జల్లు కురిపించారు. సినిమా స్కేల్, ఎమోషన్స్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, ముఖ్యంగా రణవీర్ సింగ్ పాత్రలో లీనమై నటించిన తీరు అద్భుతమని ఆయన కొనియాడారు. సాంకేతిక అంశాలు, యాక్షన్ సన్నివేశాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని రాజమౌళి అభిప్రాయపడ్డారు. మరోవైపు, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV) సైతం ఈ సినిమాపై తనదైన శైలిలో స్పందించారు. ఆదిత్య ధర్ ఈ చిత్రంతో సినిమా వ్యాకరణాన్నే మార్చేశారని, భవిష్యత్తు దర్శకులకు ఇదొక బెంచ్ మార్క్‌గా నిలుస్తుందని వర్మ పేర్కొన్నారు. ఇదే క్రమంలో మోహిత్ సూరి రూపొందించిన ‘సయారా’ చిత్రాన్ని కూడా ఆయన ప్రస్తావనకు తీసుకోవడం వీశేషం.
కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, గుండెకు హత్తుకునే భావోద్వేగాలతో సాగే ‘ధురంధర్: ది రివెంజ్’ లాంగ్ రన్‌లో రెండు వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరో మెట్టు ఎక్కించిన ఈ చిత్రం, ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచుతోంది. ఆదిత్య ధర్ ప్రతిభకు ఈ సినిమా ఒక నిదర్శనంగా నిలిచిందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి రానున్న రోజుల్లో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుంది అనేది చూడాలి.
