Ram Gopal Varma: సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వంతో రామ్ గోపాల్ వర్మ చర్చలు
సినిమా టికెట్ల వివాదానికి ముగింపు పలకాలనే ఉద్ధేశ్యంతో ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు ఏపీ మంత్రి పేర్ని నాని.
- vamsi
- Published On : January 7, 2022 / 09:42 PM IST
Ram Gopal Varma
Ram Gopal Varma: సినిమా టికెట్ల వివాదానికి ముగింపు పలకాలనే ఉద్ధేశ్యంతో ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు ఏపీ మంత్రి పేర్ని నాని. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా చర్చ సాగుతోండగా.. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై రామ్ గోపాల్ వర్మ బహిరంగంగా విమర్శలు చేశారు.
ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా సినీ పరిశ్రమ నుంచి రామ్ గోపాల్ వర్మను ప్రభుత్వంతో చర్చించేందుకు పిలిచారు మంత్రి పేర్ని నాని. టికెట్ల వ్యవహారంపై సినీ పరిశ్రమ, రాజకీయ నాయకుల మధ్య ఇటీవలికాలంలో మాటల యుద్ధం సాగిన సంగతి తెలిసిందే.
ఏపీలోని థియేటర్లపై అధికారులు చర్యలు తీసుకోవటం.. థియేటర్ల నిర్వహణ, ఎక్కువ ధరకు టికెట్ల విక్రయం, అనుమతులు లేని థియేటర్ల మూసివేత.. ప్రభుత్వ నిర్ణయంతో థియేటర్లు నడపలేక మూసివేసిన సంఘటనలు జరిగాయి.
ఈ సమస్యలన్నింటిపై జనవరి 10వ తేదీన రామ్ గోపాల్ వర్మతో భేటిలో చర్చించనున్నారు. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
