Ram Gopal Varma viral comments about Adipurush and Hanuma movie
Ram Gopal Varma : టాలీవుడ్ సెన్సేషన్ ‘హనుమాన్’ మూవీ గురించి రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేసారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం.. విజువల్ వండర్ గా ఆడియన్స్ కి గూస్బంప్స్ తెప్పించాయి. ఇక ఈ విజువల్స్ ని చాలా తక్కువ ఖర్చులో ప్రశాంత్ వర్మ చూపించారు. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో ఈ విజువల్ వండర్ ని తెరకెక్కించి తోటి మేకర్స్ ని కూడా ప్రశాంత్ వర్మ సర్ ప్రైజ్ చేసారు.
ఆ సినిమాలోని గ్రాఫిక్స్ చూసి రామ్ గోపాల్ వర్మ కూడా ఆశ్చర్యపోయారట. “ఆదిపురుష్ సినిమాలోని గ్రాఫిక్స్ ని బయట దేశాల్లో ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి రూపొందించారు. ఇక హనుమాన్ కి సంబంధించిన గ్రాఫిక్స్ ని హైదరాబాద్ లోని ఓ చిన్న ఆఫీస్ లో చేసి.. అద్భుతమైన అవుట్ ఫుట్ తో వావ్ అనిపించారు. అవి చూసి నేను ప్రశాంత్ వర్మని ప్రశ్నించాను. ఇది ఎలా చేసావు అని..? దానికి అతను ఒక మాట చెప్పాడు. వేరే దేశాల్లో చేసినా, ఇక్కడ చేసినా, ఆ గ్రాఫిక్స్ డిజైన్ ఒక రూమ్లోనేగా చేయాల్సింది. కానీ మనకి కావాల్సింది టాలెంట్ ఉన్న వ్యక్తి అంతే.. అని బదులిచ్చాడు” అంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చారు.
Also read : Thabitha Sukumar : జిమ్‌లో కసరత్తులు చేస్తున్న.. పుష్ప డైరెక్టర్ సుకుమార్ భార్య.. వీడియో వైరల్
ప్రశాంత్ వర్మ చెప్పిన మాటలు వంద శాతం కరెక్ట్ అని చెప్పుకొచ్చారు. బడ్జెట్ పరంగా ఆదిపురుష్‌తో పోలిస్తే హనుమాన్ సూపర్ చీప్ ఫిలిం. కానీ రిజల్ట్ పరం హనుమాన్ ఏంటో అందరూ చూసారు అంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చారు. అలాగే మన దగ్గర ఉన్న టాలెంట్‌ని, టెక్నాలజీని గుర్తించకుండా చాలామంది విదేశాలు వైపు చూస్తున్నారని, ప్రశాంత్ లా ఇక్కడి టాలెంట్ గుర్తిస్తే తక్కువ ఖర్చులో వండర్స్ క్రియేట్ చేయొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్జీవీ కామెంట్స్ వైరల్ గా మారాయి.
RGV: Compared to #Adipurush toh Hanu-Man is a super cheap film no and we know the result.. 💥@omraut 🌚 pic.twitter.com/JSIiWLPfjD
— — ÷ (@charanvicky_) April 16, 2024