BoyapatiRAPO : టైటిల్ గ్లింప్స్‌కి డేట్ ఫిక్స్ చేసిన రామ్.. ఊర మాస్ ఉంటుందట!
రామ్ అండ్ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న BoyapatiRAPO నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ టైటిల్ ని..
- gum 95921
- Published on- July 1, 2023 / 08:05 PM IST
Ram Pothineni BoyapatiRAPO movie title glimpse release date
: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి కలయికలో ఒక మాస్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ ఆడియన్స్ లో మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. BoyapatiRAPO వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టైటిల్ ని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. ఇక ఈ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఒక చిన్న గ్లింప్స్ రెడీ చేస్తున్నారు మేకర్స్.
Warner Bros Studios : పేలుడుతో వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్‌లో భారీ అగ్నిప్రమాదం..
ఈ టైటిల్ గ్లింప్స్ ని జులై 3న ఉదయం 11:25 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ గ్లింప్స్ యాక్షన్ తో ఊర మాస్ ఉండబోతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఊర మాస్ గా ఉంది. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ లో ‘నా బొంగులో లిమిట్స్’ అంటూ రామ్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. దీంతో ఈసారి ఎటువంటి డైలాగ్ ఉండబోతుందా అని ఆసక్తి చూపిస్తున్నారు మాస్ ఆడియన్స్. కాగా ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.
శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తుండగా సయీ మంజ్రేకర్ ఓ పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా రామ్ తో కలిసి స్పెషల్ సాంగ్ లో చిందులేయనుంది. ఈ సినిమా కోసం రామ్ చాలా కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే కొంచెం బరువు ఎక్కి, గడ్డం కూడా పెంచాడు. ముందుగా ఈ సినిమాని అక్టోబర్ లో రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన మూవీ టీం.. దాని ప్రీపోన్ చేసి సెప్టెంబర్ 15కి తీసుకు వచ్చేశారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నారు.
