Warner Bros Studios : పేలుడుతో వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్‌లో భారీ అగ్నిప్రమాదం..
హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం నాడు జరిగిన పేలడంతో..

Fire Brokes at Warner Bros Studios due to transformer explode
Warner Bros Studios : ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికా కాలిఫోర్నియా (California) లోని బర్బ్యాంక్ లో(Burbank) ఉన్న వార్నర్ బ్రదర్స్ స్టూడియోలో ఈ శుక్రవారం (జూన్ 30) నాడు ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో అగ్ని చెలరిగినట్లు సమాచారం. పేలుడు జరిగిన కాసేపటిలోనే మంటలు భారీగా చెలరేగడంతో నల్ల పొగ స్టూడియో మొత్తని కమ్మేసింది. ఆ మంటల్లో కొంతమంది జనాలు కూడా చిక్కుకుపోయారు.
The Legend of Hanuman : ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 వచ్చేస్తుంది.. మొదటి రెండు బ్లాక్ బస్టర్..
అయితే ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. ఏ ఒక్కరికి ప్రాణానికి హాని కలగకుండా కాపాడారు. ఎటువంటి ప్రాణనష్టం జరగపోవడంతో ప్రతిఒక్కరు హమ్మయ్య అనుకున్నారు. అలాగే ఈ యాక్సిడెంట్ గల పూర్తి కారణాలు తెలుసుకోడానికి అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu : నీ దూకుడు సాటెవ్వడు.. బాబోయ్ జిమ్‌లో మహేష్ వర్క్ అవుట్స్ చూశారా..
BREAKING!? There is a HUGE fire reported at Warner Bros Studios in Los Angeles, CA. ??? pic.twitter.com/sDm1uoCKuJ
— The Patriot Voice (@TPV_John) June 30, 2023
కాగా ఇటీవల గ్లాడియేటర్ 2 (Gladiator 2) లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు 23 ఏళ్ల క్రిందట వచ్చిన సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా సెట్ లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఇంతటి ప్రమాదం ఎప్పుడు చూడలేదని చెప్పుకొచ్చారు.