Mahesh Babu : నీ దూకుడు సాటెవ్వడు.. బాబోయ్ జిమ్‌లో మహేష్ వర్క్ అవుట్స్ చూశారా..

జిమ్‌లో మహేష్ బాబు చేస్తున్న వర్క్ అవుట్స్ చూశారా. ఆ వీడియోలో మహేష్ స్పీడ్ చూసి.. నీ దూకుడు సాటెవ్వడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

Mahesh Babu : నీ దూకుడు సాటెవ్వడు.. బాబోయ్ జిమ్‌లో మహేష్ వర్క్ అవుట్స్ చూశారా..

Mahesh Babu work outs for SSMB29 in gym video gone viral

Updated On : July 1, 2023 / 5:07 PM IST

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు 47 ఏళ్ళ వయసు వచ్చినా.. ఇంకా 27 ఏళ్ళ యువకుడిగా కనిపిస్తూ అందర్నీ మెస్మరైజ్ చేస్తున్నాడు. రోజురోజుకి మరి యంగ్ అవుతూ స్టైలిష్ లుక్స్ లో దర్శనమిస్తూ అదరగొడుతున్నాడు. అయితే ఇలా ఫిట్ గా కనిపించడానికి మహేష్ కూడా భారీ స్థాయిలోనే కసరత్తులు చేస్తున్నాడు. ప్రస్తుతం తన సినిమా షూటింగ్స్ కి బ్రేక్ పడడంతో జిమ్ లో వర్క్ అవుట్స్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఇటీవల కూడా మహేష్ జిమ్ లో కసరత్తులు చేస్తున్న ఫోటోలు బయటకి వచ్చి వైరల్ అయ్యాయి.

Rajamouli : రాజమౌళికి అరుదైన గౌరవం.. ISBC చైర్మ‌న్‌గా నియామకం..

తాజాగా ఇప్పుడు ఒక కొత్త వీడియో బయటకి వచ్చింది. ఆ వీడియోలో మహేష్.. డుంబుల్స్ తో కసరత్తులు చేయడం, థ్రెడ్ వీల్ పై వేగంగా పరిగెడుతూ కనిపిస్తున్నాడు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ‘నీ దూకుడు సాటెవ్వడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా మహేష్, రాజమౌళితో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం అమెజాన్ అడవులు నేపథ్యంతో యాక్షన్ అండ్ అడ్వెంచర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Keeda Cola Harikanth : సినిమా రిలీజ్‌కి ముందే టాలీవుడ్ యువనటుడు గుండెపోటుతో మృతి..

ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలు కోసం మహేష్ ఇంతలా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం గుంటూరు కారం (Guntur Karam) సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ అనేక కారణాలు వల్ల లేటు అవుతూ వస్తుంది. దీంతో ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తున్న పూజా హెగ్డే (Pooja Hegde) ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఆల్రెడీ పూజా పై చిత్రీకరించిన సీన్స్ ని మళ్ళీ రీ షూట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ రీ షూట్‌లు, షూటింగ్ లేట్ వల్ల మూవీ సంక్రాంతికి రాకపోవచ్చు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమా పనులు మొత్తం పూర్తి అయితే తప్ప మహేష్, రాజమౌళి సినిమాకు షిఫ్ట్ అవ్వడు.