Ramani Kalyanam : 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమా.. నడవలేని అబ్బాయి, చూపులేని అమ్మాయి ప్రేమకథ..

సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ జంటగా తెరకెక్కిన సినిమా రమణి కళ్యాణం. (Ramani Kalyanam)

  • Updated on- June 9, 2026 / 09:10 PM IST

Ramani Kalyanam

Ramani Kalyanam : ఇటీవల పెద్ద సినిమాలు నెల రోజుల్లోకి వచ్చేస్తున్నాయని, దానివల్ల థియేటర్స్ కి నష్టం జరుగుతున్నాయని గోల పెడుతుంటే చిన్న సినిమాలు, కొన్ని మిడ్ రేంజ్ సినిమాలు అయితే రెండు మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. రమణి కళ్యాణం అనే సినిమా థియేటర్స్ లో రిలీజయిన మూడు వారాలకే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.

సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ జంటగా తెరకెక్కిన సినిమా రమణి కళ్యాణం. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి, శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మాణంలో విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రమణి కళ్యాణం సినిమా మే 22న థియేటర్స్ లో రిలిజయి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. యాంకర్ శ్యామల, శ్రీనివాస్ రెడ్డి, చైతన్య జొన్నలగడ్డ, లోహిత్ కుమార్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

Also See : Irumudi : ‘ఇరుముడి’ షూటింగ్ పూర్తి.. వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన హీరోయిన్..

రమణి కళ్యాణం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈటీవీ విన్ ఓటీటీలో జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ విషయాన్నీ ఈటీవీ విన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో హీరోకి ఓ సంఘటనలో కాళ్ళు పోవడంతో వీల్ చైర్ కే అంకితమైపోతాడు. ఇక హీరోయిన్ కి చిన్నప్పుడు జరిగిన యాక్సిండెంట్ లో కళ్ళు పోతాయి. చూపులేని అమ్మాయి – నడవలేని అబ్బాయి మధ్య ఓ ప్రేమకథగా ఈ సినిమా సాగుతుంది. మధ్యలో బోర్ కొట్టినా, అక్కడక్కడా సాగదీసినా చివర్లో ఎమోషనల్ గా ముగిస్తారు.