Ramya Krishna : బాహుబలి రిజెక్ట్ చేశా.. ఐటెం సాంగ్స్ ఇష్టం.. పెళ్లికి ముందు రోజు రాత్రి కూడా ఎన్టీఆర్ తో ఐటెం సాంగ్..

తనకు ఐటెం సాంగ్స్ చేయడం ఇష్టం అని, బాహుబలి సినిమా మొదట రిజెక్ట్ చేసానని తెలిపింది. (Ramya Krishna)

  • Published on- November 16, 2026 / 07:01 PM IST

Ramya Krishna

Ramya Krishna : ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ ఇప్పటికి కూడా వరుసగా పవర్ ఫుల్ పాత్రలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ తన గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో తనకు ఐటెం సాంగ్స్ చేయడం ఇష్టం అని, బాహుబలి సినిమా మొదట రిజెక్ట్ చేసానని తెలిపింది.

బాహుబలి సినిమా గురించి మాట్లాడుతూ.. నేను సినిమాలకు గ్యాప్ తీసుకొని సీరియల్స్ చేస్తున్నాను నిర్మాతగా. అప్పుడు ఫుల్ వర్క్ స్ట్రెస్. మధ్యలో ఒక సినిమా 25 డేస్ డేట్స్ కావాలంటే కష్టపడ్డాను అడ్జస్ట్ చేయడానికి. అప్పుడు మా అబ్బాయికి 6 ఏళ్ళు. అలాంటి సమయంలో శోభు గారు కాల్ చేసి 40 రోజులు డేట్స్ కావాలి అన్నారు. నో అని చెప్పి ఫోన్ పెట్టేసాను. కానీ పెద్ద సినిమా, తెలుగులో భారీ బడ్జెట్ అని వార్తలు వస్తున్నాయి. మా నాన్న ఈ వార్తలు అన్ని ఫాలో అయి నాకు చెప్పారు. ఆ సినిమా గురించి గొప్పగా చెప్పి చేయాలి అన్నారు. అయినా నేను ఒప్పుకోలేదు. శోభు గారు మళ్ళీ కాల్ చేసి ఒకసారి నేరేషన్ వినమన్నారు. అప్పుడు రాజమౌళి నేరేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు నచ్చింది. కానీ హీరోయిన్ నుంచి మదర్ రోల్ అని మొదట ఆలోచించాను అని తెలిపారు.

Also Read : Sri Vidya : నాన్న చిన్నప్పుడే చనిపోయారు.. నేను హైదరాబాద్ వస్తే అమ్మని చాలా మాటలు అన్నారు.. శ్రీ విద్య ఎమోషనల్..

ఐటెం సాంగ్స్ గురించి మాట్లాడుతూ.. హీరోయిన్ గా చేసేటప్పుడే నేను ఐటెం సాంగ్స్ చేశాను. బాలీవుడ్ లో కూడా ఐటెం సాంగ్స్ చేసాను. నా పాత్రల్లో మొనాటని ఉండకూడదు అని, నాకు డ్యాన్స్ అంటే ఇష్టం అని ఐటెం సాంగ్స్ చేశాను. తెలుగు, తమిళ్, హిందీలో చేశాను. ఏ పాట చేయాలి అని పాట విని మా సిస్టర్ డిసైడ్ చేసేది. బాహుబలి సక్సెస్ పార్టీలో రాజమౌళి నెక్స్ట్ ఎలాంటి పాత్ర చేయాలి అనుకుంటారు అని అడిగితే వెంటనే ఐటెం సాంగ్ చేయాలి అని చెప్పా దాంతో ఆయన షాక్ అయ్యారు. కానీ రాజమౌళితో ఫస్ట్ నేను చేసింది సింహాద్రి సినిమాలో ఐటెం సాంగ్. నా పెళ్లికి ముందు రోజు రాత్రి ‘చిన్నదమ్మి చీకులు కావాలా..’ సాంగ్ షూట్. రాజమౌళి ఎంతసేపైనా వదలట్లేదు. ఇంక నన్ను వదలండి రేపు నా పెళ్లి మీరు వదలకపోతే నా పెళ్లి అవ్వదు అని చెప్పనినట్లు తెలిపింది.