Ramya Krishnan : వాట్.. రమ్యకృష్ణకు కాలి మడమ జాయింట్ లేదా? 39 ఏళ్ళ క్రితమే లెగ్ ఫ్రాక్చర్.. మెడికల్ మిరాకిల్..

తాజాగా నటి రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో 1987 లో జరిగిన తన లెగ్ ఫ్రాక్చర్ గురించి చెప్తూ.. (Ramya Krishnan)

  • Published on- November 16, 2026 / 03:26 PM IST

Ramya Krishnan

Ramya Krishnan : సినీ సెలబ్రిటీలు షూటింగ్స్ లో గాయపడుతూ ఉంటారు. ఆ గాయాలు మానిపోయాక మళ్ళీ సినిమాలు చేస్తారు. కొంతమంది కష్టమైనా ఆ గాయాలతోనే సినిమాలు చేస్తారు. తాజాగా నటి రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో 1987 లో జరిగిన తన లెగ్ ఫ్రాక్చర్ గురించి చెప్తూ అసలు తనకు కాలి మడమ జాయింట్ లేదు అనే ఆసక్తికర విషయాన్ని తెలిపింది.

Also Read : Ramya Krishnan : విడాకులపై స్పందించిన రమ్యకృష్ణ.. పెళ్లి ఓవర్ రేటెడ్.. మేం ఇప్పుడు వేర్వేరుగా..

రమ్యకృష్ణ మాట్లాడుతూ.. నా రైట్ లెగ్ ఎప్పుడో ఫ్యాక్చర్ అయింది. 1987 లోనే ఫ్యాక్చర్ అయింది. ఇప్పుడు కూడా చూసి ఆర్దోపెడిక్స్ చెప్తారు. దాంతో మాములుగా నడవడమే కష్టం. కానీ ఆ టైంలో డ్యాన్స్ లు అంటే ఆశ్చర్యపోయారు. అప్పట్లో సర్జరీ సరిగ్గా జరగలేదు. ఇప్పుడు అసలు నా యాంకిల్(కాలి మడమ) జాయింట్ లేదు. ఇది మెడికల్ మిరాకిల్ అని డాక్టర్స్ చెప్తున్నారు.

1987 లో షూటింగ్ సెట్స్ లో ఈ ఘటన జరిగింది. కంటిన్యూ షూట్ రాత్రి పగలు జరుగుతుంటే ఏదో గ్యాప్ వస్తే ఓ మూల పడుకుందామని ఇంకో సెట్ పైకి వెళ్తుంటే మెట్లు విరిగిపోయి సెట్ మీద నుంచి కింద పడ్డాను. కాలు వెంటనే వంకర తిరిగిపోయింది. లేచి వెల్దామంటే కూడా వెళ్ళలేకపోయాను. అపుడు ఫుల్ ట్రీట్మెంట్ కి కూడా డబ్బులు లేవు, వరుస ఫ్లాప్స్ లో ఉన్నా. డబ్బుల కోసం ఆ సమయంలో ఒక కమెడియన్ తో సినిమాకు ఒప్పుకున్నా. కానీ ఆ ఫ్రాక్చర్ తర్వాతే నా కెరీర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాతే అన్ని సాంగ్స్ చేశాను. ఇప్పటికి ఆ ఫ్రాక్చర్ తర్వాత కాలి జాయింట్ లేకుండా డ్యాన్సులు వేసానంటే డాక్టర్స్ సైతం ఆశ్చర్యపోతారు అని తెలిపింది.

Also Read : Bhootham Praytham : యాదమ్మ రాజు, ఇమ్మాన్యుయేల్ హీరోలుగా.. హారర్ కామెడీ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..