‘రొమాంటిక్’లో రమ్యకృష్ణ
ఆకాష్ పూరీ, కేతికా శర్మ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్.. ‘రొమాంటిక్’లో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటించనుంది..
- sekhar
- Published on- October 16, 2019 / 06:23 AM IST
ఆకాష్ పూరీ, కేతికా శర్మ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్.. ‘రొమాంటిక్’లో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటించనుంది..
ఆకాష్ పూరీ, కేతికా శర్మ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్.. ‘రొమాంటిక్’. శ్రీమతి లావణ్య సమర్పణలో, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్స్‌పై, పూరీ జగన్నాథ్, చార్మీ కలిసి ప్రొడ్యూస్ చేస్తుండగా.. అనిల్ పాదూరి డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.
ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటించనుంది. ‘రొమాంటిక్’లో ఆమె ఇంపార్టెంట్ అండ్ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారని, అక్టోబర్ 16 నుండి షూటింగులో జాయిన్ అవుతున్నారని మూవీ టీమ్ తెలిపింది. మందిరా బేడి, మకరంద్ దేశ్ పాండే ఇతర పాత్రల్లో నటిస్తున్నఈ సినిమాకి సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నాడు.
Read Also : NBK 105 ‘రూలర్’ ఫిక్స్!
అక్టోబర్ 15న ‘రొమాంటిక్’ సినిమా సెట్లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. సెట్లో ఏర్పాటు చేసిన తెరకు నిప్పంటుకుని, ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన యూనిట్ సభ్యులు మంటలు ఆర్పారు. ఎంతో ఎత్తులో ఏర్పాటు చేసిన తెరలకు కూడా మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
