Animal Collections : వీక్ డేలో కూడా హాఫ్ సెంచరీ పై కలెక్షన్స్.. బాక్సాఫీస్‌పై యానిమల్ పంజా..

మండే కూడా హాఫ్ సెంచరీ పై కలెక్షన్స్ అందుకొని బాక్సాఫీస్‌కి యానిమల్ తన పంజా దెబ్బ ఏంటో చూపించింది.

Ranbir Kapoor Animal movie fourth day Collections world wide

Animal Collections : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘యానిమల్’. అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా నాన్న ఎమోషన్ ని వైల్డ్ గా చూపించి ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది. ముఖ్యంగా యూత్ ని ఈ చిత్రం బాగా ఆకట్టుకుంటుంది. దీంతో వీకెండ్, వీక్ డే అనే తేడా లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ బిగ్గెస్ట్ హిట్టుగా దూసుకుపోతుంది. ఈ మండే కూడా హాఫ్ సెంచరీ పై కలెక్షన్స్ అందుకొని బాక్సాఫీస్‌కి యానిమల్ తన పంజా దెబ్బ ఏంటో చూపించింది.

డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 116 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది. సెకండ్ అండ్ థర్డ్ డేస్ లో ఫస్ట్ డేని మించి 120 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుంది. మొదటి వీకెండ్ పూర్తి అయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 356 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇక వీక్ డే అయిన నాలుగవ రోజు సోమవారం నాడు దాదాపు 69 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. దీంతో ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 425 కోట్ల గ్రాస్ ని అందుకుంది.

Also read : Ritika Singh : ఆ హీరోయిన్‌ చేతికి గాయాలు.. బ్రేక్ తీసుకుంటున్నా అంటూ పోస్టు

ఇక ఇదే స్పీడ్ కొనసాగితే.. ఈ మూవీ 1000 కోట్ల మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదు అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్ద సినిమా రిలీజ్ లు ఏం లేవు. ఇటు సౌత్ లో కూడా మాస్ మసాలా చిత్రాలేవీ లేవు. మరి యానిమల్ బాక్స్ ఆఫీస్ ఏ రేంజ్ పంజా వేస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ పై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలో లైంగిక, గృహ హింస ఎక్కువగా ఉందని పలువురు మూవీ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు