Tu Jhoothi Main Makkaar : 200 కోట్లు కొల్లగొట్టిన రణబీర్.. బాలీవుడ్ కి ఇంకో పెద్ద హిట్..
ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజయిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది. కొన్ని రోజుల క్రితం తూ జూతి మైన్ మక్కర్ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ సాధించగా తాజాగా...............
- Saketh U
- Published on- March 29, 2023 / 04:27 PM IST
Ranbir Kapoor Tu Jhoothi Main Makkaar movie collects 200 crores gross collections
Tu Jhoothi Main Makkaar : గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్స్ వస్తుండటంతో నిరాశలో ఉన్న బాలీవుడ్(Bollywood) కి షారుఖ్(Shahrukh) పఠాన్(Pathaan) సినిమాతో 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఒక్కసారిగా సక్సెస్ ని అందించాడు. కానీ మళ్ళీ ఆ తర్వాత వచ్చిన స్టార్ హీరోల సినిమాలు షెహజాదా, సెల్ఫీ, కొన్ని చిన్న సినిమాలు మళ్ళీ ప్రేక్షకులని నిరాశపరిచాయి. దీంతో ఇటీవల రణబీర్ కపూర్(Ranbir Kapoor) మరోసారి బాలీవుడ్ కి సక్సెస్ ని అందించాడు. గత సంవత్సరం బ్రహ్మాస్త్ర(Brahmastra) సినిమాతో పర్వాలేదనిపించే హిట్ కొట్టిన రణబీర్ కపూర్ ఇప్పుడు తూ జూతి మైన్ మక్కర్(Tu Jhoothi Main Makkaar) సినిమాతో శ్రద్ధ కపూర్(Shraddha Kapoor) జంటగా రొమాంటిక్ లవ్ స్టోరీతో మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజయిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది. కొన్ని రోజుల క్రితం తూ జూతి మైన్ మక్కర్ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ సాధించగా తాజాగా మార్చ్ 28 వరకు ఏకంగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 201 కోట్ల గ్రాస్ లో 161 కోట్లు ఇండియా నుంచి, మిగిలిన 40 కోట్ల గ్రాస్ విదేశాల నుంచి వచ్చాయి. ఓవరాల్ గా దాదాపు 140 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకు. దీంతో చిత్రయూనిట్, రణబీర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Indian 2 : దేశాలు తిరిగేస్తున్న లోకనాయకుడు.. తైవాన్ లో ఇండియన్ 2 షూటింగ్..
అయితే ఈ సినిమా బడ్జెట్ దాదాపు 150 కోట్ల వరకు అయింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు 140 కోట్లకు పైగానే అయింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం ఇంకో 10 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించాలి. ఈ వీకెండ్ లోపు ఆ కలెక్షన్స్ సాధిస్తుందని భావిస్తున్నారు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు. తూ జూతి మైన్ మక్కర్ సినిమాకు 200 కోట్లు రావడంతో మరోసారి బాలీవుడ్ లో ఆశలు చిగురించాయి. త్వరలో రాబోయే మరిన్ని సినిమాలు సక్సెస్ అవుతాయని ఆశిస్తున్నారు.
