Rangabali ott release : ఓటీటీలోకి వచ్చేస్తున్న రంగబలి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
యంగ్ హీరో నాగశౌర్య(Naga Shaurya) నటించిన సినిమా రంగబలి(Rangabali). పవన్ బాసం శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యుక్తి తరేజా(Yukti Thareja) హీరోయిన్‌గా నటించింది.
- Thota Vamshi Kumar
- Published On : July 28, 2023 / 03:12 PM IST
Rangabali ott release
Rangabali ott : యంగ్ హీరో నాగశౌర్య(Naga Shaurya) నటించిన సినిమా రంగబలి(Rangabali). పవన్ బాసం శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యుక్తి తరేజా(Yukti Thareja) హీరోయిన్‌గా నటించింది. ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. జూలై 7 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగశౌర్య, సత్య కామెడీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో లు కీలక పాత్రల్లో నటించిన లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓటీటీ ప్రేక్షకులను ఎలా అలరించనుందో చూడాల్సిందే.
Lucky Baskhar : ‘లక్కీ భాస్కర్’గా దుల్కర్.. మరో డైరెక్ట్ తెలుగు సినిమాతో..
కథ :
రాజవరం గ్రామానికి చెందిన శౌర్య(నాగశౌర్య) కి తన ఊరు అంటే ఎంతో అభిమానం. అదే అతడి బలం, బలహీనత కూడా. ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా జీవితాన్ని సరదాగా గడిపేస్తుంటాడు. అతడి తండ్రి ఊరిలోనే మెడికల్ షాపును నిర్వహిస్తూ చాలా గౌరవంగా బతుకుతుంటాడు. కుమారుడికి ఆ మెడికల్ షాపు బాధ్యతలు అప్పగించాలనేది అతడి కోరిక. కుమారుడిని దారిలో పెట్టేందుకు వెజాగ్ పంపిస్తాడు. తండ్రి కోరిక కాదనకలేక ఫార్మసీ ట్రైనింగ్ కోసం ఓ మెడికల్ కాలేజీలో చేరుతాడు శౌర్య.
Anushka Shetty : సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న అనుష్క.. ఆ సినిమా తర్వాత?
అక్కడ సహజ(యుక్తి తరేజ)తో ప్రేమలో పడతాడు. సహజ తండ్రి మురళీ శర్మకు రాజవరం గ్రామానికి ఉన్న సంబంధం ఏమిటి..? ఎమ్మెల్యే పరశురామ్(షైన్ టామ్ చాకో)తో శౌర్య పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది. శౌర్య ప్రేమకు ఊరిలో ఉన్న మెయిన్ సెంటర్ రంగబలికి ఉన్న సంబంధం ఏమిటి..? తన ప్రేమను శౌర్య దక్కించుకున్నాడా..? అన్నవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
