Anushka Shetty : సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న అనుష్క.. ఆ సినిమా తర్వాత?

అనుష్క- నవీన్‌ పొలిశెట్టి కీలక పాత్రల్లో వస్తున్న చిత్రం 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Anushka Shetty : సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న అనుష్క.. ఆ సినిమా తర్వాత?

Anushka Shetty will say good bye to Movies after Miss Shetty Mr Polishetty

Anushka Shetty :  స్టార్ హీరోయిన్ అనుష్క సినిమాలకు వీడ్కోలు పలకనుందా..? మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటిస్తున్న బ్యూటీ స్వీటీ అదే చివరి సినిమా ని చెప్పబోతున్నట్టు సమాచారం. కన్నడ నుంచి వచ్చి హిందీతోపాటు సౌత్ ఇండియన్ భాషలన్నింటిలో నటించి స్టార్ హీరోయిన్‌గామారింది అనుష్క. హీరోలు లేకపోయినా తన లేడీ స్టార్ డంతో సినిమాలకి కోట్లు కురించింది.

అభిమానులు స్వీటీ అని పిలుచుకునే నటి అనుష్క. అందం, అభినయంలో చిత్ర పరిశ్రమలో విశేష గుర్తింపు తెచ్చుకుంది అనుష్క. మంగళూరుకి చెందిన యోగా టీచర్‌ అనుష్క 2005లో సూపర్‌ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో అందాలను ఆరబోసిన అనుష్క ఆ తరువాత కూడా చాలా చిత్రాల్లో గ్లామరస్‌ పాత్రలకే పరిమితమయ్యారు. అలా తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ కెరియర్‌ను అరుంధతి చిత్రం ఒక్కసారిగా మార్చేసింది. అందులో జేజమ్మగా తన అభినయంతో ప్రేక్షకుల నుంచి జేజేలు అందుకున్నారు. ఆ తరువాత బాహుబలి, భాగమతి వంటి చిత్రాల్లో అద్భుత నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచారు.

సైజు జీరో చిత్రం అనుష్క నట జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసేసింది. ఆ పాత్ర కోసం అనుష్క బరువుని భారీగా పెంచేసుకుంది. ఆ తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో కొన్ని సినిమాలు చేయలేకపోయింది అనుష్క. చాలా గ్యాప్‌ తర్వాత నిశ్శబ్దం అనే చిత్రంతో వచ్చినా అది శబ్దం లేకుండానే వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు అనుష్క- నవీన్‌ పొలిశెట్టి కీలక పాత్రల్లో వస్తున్న చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Suriya 43 : సూర్య 43 ఫిక్స్.. సుధా కొంగర డైరెక్షన్.. దుల్కర్ సల్మాన్ స్పెషల్ అప్పీరెన్స్.. GV ప్రకాష్ 100వ సినిమా కూడా..

అయితే ఇదే అనుష్క ఆఖరి చిత్రంగా టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అవకాశాలు తగ్గిపోతున్న నేపథ్యంలో ఇక సినిమాల కోసం ప్రయత్నించకుండా రెస్ట్ తీసుకోవాలని అనుకుంటుందట టాలీవుడ్ జేజమ్మ. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రిలీజ్ తర్వాత సినిమాల నుంచి తన రిటైర్మెంట్ ప్రకటన చేస్తుందని చెబుతున్నారు సినీ పరిశ్రమ వ్యక్తులు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒకవేళ నిజమైతే మాత్రం అనుష్క అభిమానులు నిరాశ చెందుతారు.