Suriya 43 : సూర్య 43 ఫిక్స్.. సుధా కొంగర డైరెక్షన్.. దుల్కర్ సల్మాన్ స్పెషల్ అప్పీరెన్స్.. GV ప్రకాష్ 100వ సినిమా కూడా..

తాజాగా సూర్య 43వ సినిమా గురించి క్లారిటీ వచ్చింది. సూర్యకి ఆకాశం నీ హద్దురా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన సుధా కొంగర డైరెక్షన్ లోనే సూర్య 43వ సినిమా ఉండబోతుందని సమాచారం.

Suriya 43 : సూర్య 43 ఫిక్స్.. సుధా కొంగర డైరెక్షన్.. దుల్కర్ సల్మాన్ స్పెషల్ అప్పీరెన్స్.. GV ప్రకాష్ 100వ సినిమా కూడా..

Suriya 43 Movie under Sudha Kongara Direction with Dulqer Salman Guest Appearance

Suriya 43 Movie: సూర్య చివరగా విక్రమ్, రాకెట్రి సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో కనిపించి మెప్పించాడు. త్వరలో భారీ బడ్జెట్ సినిమా ‘కంగువ’తో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే కంగువ గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక కంగువ తర్వాత సూర్య 43వ సినిమా గురించి ఎప్పట్నుంచో వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా సూర్య 43వ సినిమా గురించి క్లారిటీ వచ్చింది. సూర్యకి ఆకాశం నీ హద్దురా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన సుధా కొంగర డైరెక్షన్ లోనే సూర్య 43వ సినిమా ఉండబోతుందని సమాచారం. దీని గురించి ఇటీవల తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు GV ప్రకాష్ ఓ సినిమా ఈవెంట్ లో మాట్లాడాడు. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్నాను. అది నా 100వ సినిమా అని చెప్పడంతో సూర్య నెక్స్ట్ సినిమాపై క్లారిటీ వచ్చేసింది.

Prasads Multiplex : ప్రసాద్స్ మల్టీప్లెక్స్.. 20 ఏళ్ళు.. హైదరాబాద్‌లో ఏ సినిమా అయినా ఫస్ట్ షో అక్కడే.. రాజమౌళి స్పెషల్ ట్వీట్..

ఇక ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఓ ముఖ్య పాత్ర చేయనున్నట్టు తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో సూర్య 43 ట్రెండింగ్ లో ఉంది. మొదట ఈ పాత్రని కార్తితో చేయించాలని అనుకున్నా తర్వాత దుల్కర్ ని తీసుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమా హోంబలే ఫిలిమ్స్, 2D ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తారని ఇండస్ట్రీ టాక్.