Prasads Multiplex : ప్రసాద్స్ మల్టీప్లెక్స్.. 20 ఏళ్ళు.. హైదరాబాద్‌లో ఏ సినిమా అయినా ఫస్ట్ షో అక్కడే.. రాజమౌళి స్పెషల్ ట్వీట్..

25 జులై 2002న ప్రసాద్స్ మల్టీప్లెక్స్ హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ వద్ద ప్రారంభమైంది. అప్పట్నుంచి 20 ఏళ్లుగా ఎన్నో సినిమాలని ప్రేక్షకులకు అందిస్తూ వస్తుంది.

Prasads Multiplex : ప్రసాద్స్ మల్టీప్లెక్స్.. 20 ఏళ్ళు.. హైదరాబాద్‌లో ఏ సినిమా అయినా ఫస్ట్ షో అక్కడే.. రాజమౌళి స్పెషల్ ట్వీట్..

Prasads Multiplex completed 20 years special video shared Rajamouli and other Celebrities Special posts on Prasads Multiplex

Updated On : July 28, 2023 / 11:02 AM IST

Prasads Multiplex 20 Years :  తెలుగు ప్రజలకి సినిమా అంటే మాములు పిచ్చి కాదు. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా వారానికి ఒక సినిమాకి వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక హైదరాబాద్ మహానగరంలో ఎక్కువ థియేటర్స్, ఎక్కువ జనాభా, ఎక్కువ సినిమాలు.. ఎన్ని థియేటర్స్ ఉన్నా హైదరాబాద్ లో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ స్థానం వేరు. హైదరాబాద్ లో 2002 లో మొదటి మల్టీప్లెక్స్ థియేటర్ గా ప్రారంభమైంది ప్రసాద్స్ మల్టీప్లెక్స్ .

25 జులై 2002న ప్రసాద్స్ మల్టీప్లెక్స్ హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ వద్ద ప్రారంభమైంది. అప్పట్నుంచి 20 ఏళ్లుగా ఎన్నో సినిమాలని ప్రేక్షకులకు అందిస్తూ వస్తుంది. ఇప్పుడంటే బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ స్పెషల్ షోలు అని సినిమా రిలీజ్ రోజు పొద్దున్నే, తెల్లవారు జామున కొన్ని థియేటర్స్ లో సినిమాలు వేస్తున్నారు కానీ కొన్ని రోజుల క్రితం వరకు కూడా హైదరాబాద్ లో ఫస్ట్ షో ప్రసాద్ మల్టీప్లెక్స్ లోనే పడేది. సినిమా యునిట్, మీడియా, స్టార్లు.. ఎంతోమంది తమ సినిమాని ప్రసాద్స్ స్క్రీన్ పై చూడటానికి రిలీజ్ రోజు అక్కడికి వచ్చి హంగామా చేసేవారు.

ఇక ఎంతోమంది ప్రేక్షకులకు ప్రసాద్ మల్టీప్లెక్స్ సినిమా దేవాలయం. ఇటీవల రివ్యూలకు కేరాఫ్ అడ్డాగా మారి ఎంతోమందికి కెరీర్ కూడా ఇచ్చింది ప్రసాద్స్ మల్టీప్లెక్స్. తాజాగా ప్రసాద్ మల్టీప్లెక్స్ మొదలయి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ప్రసాద్ మల్టీప్లెక్స్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు. ప్రసాద్స్ మల్టీప్లెక్స్ కూడా ఓ స్పెషల్ వీడియో తయారు చేసి తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 20 సంవత్సరాలు, 1000 శుక్రవారాలు, ఎన్నో సినిమాలు.. అంటూ స్పెషల్ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Bro Movie : ఒరిజినల్ ‘వినోదయసీతం’.. ‘బ్రో’ సినిమాకు తేడాలు ఇవే.. 5 కోట్ల బడ్జెట్ వర్సెస్ 75 కోట్ల బడ్జెట్..

ప్రసాద్స్ మల్టీప్లెక్స్ షేర్ చేసిన వీడియోని షేర్ చేస్తూ రాజమౌళి కూడా.. ఎన్నో సినిమాలు ప్రసాద్స్ లో చూశాను. ప్రతి శుక్రవారం పొద్దున్నే 8.45 షోకి ప్రసాద్స్ దగ్గర ఉండేవాడిని. అప్పుడే 20 ఏళ్ళు అయిపోయిందా? ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ఒక థియేటర్ మాత్రమే కాదు నా క్లాస్ రూమ్ కూడా, ఒక ఎమోషన్ ఇది అంటూ పోస్ట్ చేశారు. సినిమా లవర్స్ అంతా కూడా ప్రసాద్స్ మల్టీప్లెక్స్ వీడియోని షేర్ చేస్తున్నారు.