Bro Movie : ఒరిజినల్ ‘వినోదయసీతం’.. ‘బ్రో’ సినిమాకు తేడాలు ఇవే.. 5 కోట్ల బడ్జెట్ వర్సెస్ 75 కోట్ల బడ్జెట్..

త‌మిళంలో మంచి విజ‌యం సాధించిన వినోద‌య సితం సినిమాకు బ్రో రీమేక్‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సముద్రఖని ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కింది. అయితే ఒరిజినల్ వినోదయసీతంకు బ్రో సినిమాకు చాలా తేడాలు ఉన్నాయి.

Bro Movie : ఒరిజినల్ ‘వినోదయసీతం’.. ‘బ్రో’ సినిమాకు తేడాలు ఇవే.. 5 కోట్ల బడ్జెట్ వర్సెస్ 75 కోట్ల బడ్జెట్..

Vinodhaya Sitham and Bro Movie Differences

Vinodhaya Sitham Vs Bro : ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan kalyan), సాయిధ‌ర‌మ్‌ తేజ్(Sai Dharam Tej) క‌లిసి నటించిన ‘బ్రో'(Bro) సినిమా నేడు జులై 28న గ్రాండ్ గా రిలీజయింది. త‌మిళంలో మంచి విజ‌యం సాధించిన వినోద‌య సితం(Vinodhaya Sitham) సినిమాకు బ్రో రీమేక్‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సముద్రఖని(Samuthirakani) ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కింది. అయితే ఒరిజినల్ వినోదయసీతంకు బ్రో సినిమాకు చాలా తేడాలు ఉన్నాయి.

#తమిళ్ లో ఒరిజినల్ వినోదయసీతం సినిమాని డైరెక్ట్ చేసిన సముద్రఖనినే బ్రో సినిమాని కూడా డైరెక్ట్ చేశారు. కానీ తెలుగులో స్క్రీన్ ప్లే, మాటలు మాత్రం త్రివిక్రమ్ రాసి కథని కొంచెం మార్చారు.

#వినోదయసీతం లో 60 ఏళ్ళ వ్యక్తి చనిపోయి, అతని ఫ్యామిలీ పరిస్థితుల చుట్టూ కథ జరిగితే బ్రో సినిమాలో 30 ఏళ్ళ వ్యక్తి చనిపోతే అన్నట్టు కథని మార్చారు.

#వినోదయసీతంలో తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ ని ఇక్కడ అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ గా మార్చారు.

#వినోదయసీతం బడ్జెట్ 5 కోట్లు కాగా బ్రో సినిమా బడ్జెట్ దాదాపు 75 కోట్లు.

#వినోదయసీతంలో అసలు పాటలు, ఫైట్స్ ఉండవు. కానీ బ్రో సినిమాలో 5 పాటలు, రెండు ఫైట్స్ కూడా ఉన్నాయి.

#వినోదయసీతం రన్ టైం 99 నిమిషాలే కాగా వినోదయసీతం రన్ టైం 135 నిముషాలు.

#వినోదయసీతం సాధారణ ఎమోషనల్ కుటుంబ కథా చిత్రంలా ఉంటే ఇది స్టార్ హీరో ఉండటంతో ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీస్తూనే ఎమోషన్స్ కూడా చూపించారు.

#ఇక బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఆ పాత్ర నిడివి పెంచి స్పెషల్ పర్ఫార్మెన్స్ లు కూడా జత చేశారు.

 

Urvashi Rautela : ఏపీ చీఫ్ మినిష్టర్ పవన్ కళ్యాణ్ అంటూ ఊర్వశి రౌతేలా ట్వీట్.. వైరల్ అవుతున్న ట్వీట్..