Dhurandhar 2 : దురంధర్ 2 మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే.. పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేసిందా?
ప్రీమియర్స్ నుంచే ఫుల్ పాజిటివ్ టాక్ తో దురంధర్ 2 దూసుకుపోతుంది. (Dhurandhar 2)
- Saketh U
- Published On : March 20, 2026 / 07:19 AM IST
Dhurandhar 2
Dhurandhar 2 : రణవీర్ సింగ్, సారా అర్జున్ జంటగా వచ్చిన సూపర్ హిట్ సినిమా దురంధర్ కు సీక్వెల్ గా ‘దురంధర్ ది రివెంజ్’ మార్చ్ 19న రిలీజ్ అయింది. ఫస్ట్ పార్ట్ 1300 కోట్లు వసూలు చేసింది. సినిమాతో పాటు, సినిమాలోని కంటెంట్ పై జనాల్లో ఫుల్ హైప్ ఉండటంతో పార్ట్ 2 కి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే భారీ అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి.
ప్రీమియర్స్ నుంచే ఫుల్ పాజిటివ్ టాక్ తో దురంధర్ 2 దూసుకుపోతుంది. సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ షాక్ అయ్యేలా అదిరిపోయింది సినిమా. దీంతో దేశవ్యాప్తంగా ధురంధర్ 2 సినిమాని చూడటానికి ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. ముందు పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ్ భాషల్లో కూడా రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ చివరి నిమిషంలో సాంకేతిక ఇబ్బందులు రావడంతో కేవలం హిందీలోనే రిలీజ్ చేసారు. అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో హిందీ సినిమాకు భారీగానే బుకింగ్స్ అయ్యాయి.
Also See : Telangana Gaddar Awards : ఘనంగా జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డ్స్ వేడుకలు.. ఫొటోలు..
బాలీవుడ్ సమాచారం ప్రకారం ధురంధర్ 2 సినిమా ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి దాదాపు 172 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. కేవలం ప్రీమియర్స్ నుంచే 43 కోట్లకు పైగా గ్రాస్ దేశవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. ఇక మొదటి రోజు ఆల్మోస్ట్ 130 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందని సమాచారం. దేశవ్యాప్తంగా ధురంధర్ 2 సినిమాకు దాదాపు 33 వేల షోలకు పైగా పడ్డాయి. హిందీలోనే ఈ సినిమా 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది మొదటి రోజే. కేవలం తెలుగులోనే రెండు వేల షోలు పడగా దాదాపు 3 కోట్ల వరకు కేవలం హిందీ లాంగ్వేజ్ తోనే కలెక్ట్ చేసింది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమా ప్రీమియర్స్ నుంచే పడి ఉంటే ఈ సినిమా కలెక్షన్స్ మరో 10 కోట్ల వరకు ఈజీగా పెరిగేవి. అయితే మూవీ యూనిట్ ఇంకా అధికారికంగా కలెక్షన్స్ ప్రకటించలేదు.
ఇండియాలో ఫస్ట్ డే హైయెస్ట్ ఓపెనింగ్స్ కలెక్ట్ చేసిన సినిమాల్లో ప్రస్తుతం పుష్ప 2 సినిమా 294 కోట్లతో టాప్ లో ఉంది. ఆ తర్వాత RRR, బాహుబలి, కల్కి సినిమాలు ఉన్నాయి.
గమనిక : ఈ కలెక్షన్స్ సమాచారం పలు బాలీవుడ్ వెబ్ సైట్స్, బాలీవుడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తీసుకున్న సమాచారం.
