Dhurandhar 2 Collections : ధురంధర్ 2 రెండు రోజుల కలెక్షన్స్ .. ఎన్ని వందల కోట్లు..?

దేశవ్యాప్తంగా ధురంధర్ 2 సినిమాని చూడటానికి ప్రేక్షకులు, సెలబ్రిటీలు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు.

  • Published On : March 21, 2026 / 08:13 AM IST

Dhurandhar 2 Collections

Dhurandhar 2 Collections : రణవీర్ సింగ్ దురంధర్ కు సీక్వెల్ గా ‘దురంధర్ ది రివెంజ్’ మార్చ్ 19న రిలీజ్ అయింది. ఫస్ట్ పార్ట్ 1300 కోట్లు వసూలు చేసి భారీ హిట్ అయింది. ఈ సీక్వెల్ పై జనాల్లో ఫుల్ హైప్ ఉండటంతో పార్ట్ 2కి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. ప్రీమియర్స్ నుంచే ఫుల్ పాజిటివ్ టాక్ తో దురంధర్ 2 దూసుకుపోతుంది.

దేశవ్యాప్తంగా ధురంధర్ 2 సినిమాని చూడటానికి ప్రేక్షకులు, సెలబ్రిటీలు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. బాలీవుడ్ సమాచారం ప్రకారం ధురంధర్ 2 సినిమా ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి దాదాపు 172 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. కేవలం ప్రీమియర్స్ నుంచే 43 కోట్లకు పైగా గ్రాస్ దేశవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. హిందీలోనే ఫస్ట్ డే ఈ సినిమా 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయగా తెలుగులో దాదాపు 3 కోట్ల వరకు కేవలం హిందీ లాంగ్వేజ్ తోనే కలెక్ట్ చేసింది.

Also Read : Deepika Padukone : భర్త సక్సెస్ పై అస్సలు స్పందించని దీపికా పదుకోన్.. బాలీవుడ్ లో చర్చగా మారిన హీరోయిన్ మౌనం..

ఇక రెండో రోజు దేశవ్యాప్తంగా ధురంధర్ సినిమా వంద కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. కేవలం హిందీలోనే 80 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, రెస్ట్ ఆఫ్ ఇండియా 20 కోట్లు వసూలు చేసిందని సమాచారం. మొత్తంగా రెండు రోజుల్లో ధురంధర్ 2 సినిమా దాదాపు 270 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

ముందు పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ్ భాషల్లో కూడా రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ చివరి నిమిషంలో సాంకేతిక ఇబ్బందులు రావడంతో కేవలం హిందీలోనే రిలీజ్ చేసారు. అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో హిందీ సినిమాకు భారీగానే బుకింగ్స్ అయ్యాయి. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమా ప్రీమియర్స్ నుంచే పడి ఉంటే ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా పెరిగేవి. తెలుగు భాషలో నేడు మార్చ్ 21 నుంచి ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి కలెక్షన్స్ మరింత భారీగా పెరిగే అవకాశం ఉన్నాయి. ఇంకో రెండు రోజులు వీకెండ్ సెలవులు ఉండటంతో అన్ని చోట్ల బుకింగ్స్ భారీగా అవుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని మించి 1500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

Also Read : Virosh : ఆ చిన్నారి ఫ్యామిలీతో విజయ్, రష్మిక.. ఇంటికి లంచ్ కి పిలిచి.. ఫొటోలు వైరల్..

గమనిక : ఈ కలెక్షన్స్ సమాచారం పలు బాలీవుడ్ వెబ్ సైట్స్, బాలీవుడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తీసుకున్నది.