Dhurandhar
Dhurandhar : ఇటీవల చాలా సినిమాలకు సీక్వెల్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆ సీక్వెల్స్ రావడానికి చాలా టైం పడుతుంది. సినిమా రిలీజ్ తర్వాత హిట్ అయితే సీక్వెల్ లేకపోతే లేదు అన్నట్టు కొంతమంది వ్యవహరిస్తున్నారు. హిట్ అయితే సీక్వెల్ కి మళ్ళీ బడ్జెట్ పెట్టి భారీగా తీస్తున్నారు.
ఈ సీక్వెల్స్ మొదలుపెట్టిన బాహుబలి, తర్వాత వచ్చినవి పుష్ప, పొన్నియన్ సెల్వం, కెజిఎఫ్.. ఇలా అన్నీ సీక్వెల్స్ చాలా టైం తీసుకొని వచ్చాయి. త్వరలో రాబోయే పుష్ప 3, సలార్ 2, కల్కి 2, దేవర 2, OG 2, జై హనుమాన్ .. లాంటి చాలా సీక్వెల్స్ కూడా టైం ఎక్కువ తీసుకుంటున్నాయి. అసలు ఆ సీక్వెల్స్ ఎప్పుడు వస్తాయో మూవీ యూనిట్ లకే క్లారిటీ లేదు.
కానీ ధురంధర్ సినిమా పక్కా ప్లానింగ్ తో పార్ట్ 2 రిలీజ్ చేస్తుంది. బాలీవుడ్ లో రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన దురంధర్ సినిమా 2025 డిసెంబర్ లో రిలీజయి భారీ విజయం సాధించింది. ఈ సినిమా ఆల్మోస్ట్ 1200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
Also Read : Rashmika Mandanna : అప్పుడు మోకాళ్ళ నొప్పితో డాక్టర్ ని కలిసిన రష్మిక.. పెళ్లి తర్వాత మళ్ళీ..
అయితే ఈ మూవీ యూనిట్.. ధురంధర్ రెండు పార్టులని ఒకేసారి షూట్ చేసారు. కొన్ని ప్యాచ్ వర్క్స్ మాత్రమే మొదటి పార్ట్ రిలీజ్ అయి హిట్ అయ్యాక షూట్ చేసారు. మొదటి పార్ట్ రిలీజయిన మూడు నెలలకే రెండో పార్ట్ ని తీసుకొస్తున్నారు. డిసెంబర్ లో ధురంధర్ రిలీజయితే మార్చ్ 19 కి ధురంధర్ 2 రిలీజ్ అవుతుంది. సెకండ్ పార్ట్ కి ప్రమోషన్స్ కూడా ఎక్కువ హడావిడి చెయ్యట్లేదు. కేవలం కంటెంట్ నే నమ్ముకున్నారు. ఫస్ట్ పార్ట్ హిట్ తో సెకండ్ పార్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇక మన టాలీవుడ్ సినిమాల లాగా ట్రైలర్, టీజర్ లు చెప్పిన టైంకి రిలీజ్ చేయకుండా టెక్నికల్ సమస్యలు అంటూ లేట్ చేయడాలు, వాయిదా వేయడాలు చెయ్యట్లేదు. అన్నింటికంటే ఇంపార్టెంట్ మూవీ రిలీజ్ కి పది రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేసారు. మన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు రేపు రిలీజ్ అంటే ఇవాళ రాత్రికి కూడా ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయా అని ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఇక ఈ సినిమా మీద చాలా హైప్ ఉన్నా టికెట్ రేట్ లు పెంచట్లేదు.
అలాగే రెండు పార్టులకు కలిపి ఆల్మోస్ట్ 250 కోట్ల బడ్జెట్ అయింది. ముందే షూటింగ్ చేసేసారు కాబట్టి పార్ట్ 2కి సున్నా బడ్జెట్ లెక్కే. ఆల్రెడీ పార్ట్ 1 లోనే ఫుల్ ప్రాఫిట్స్ వచ్చేసాయి. ఇప్పుడు వచ్చేదంతా బోనస్. ఇలా డైరెక్టర్ ఆదిత్య ధర్, నిర్మాణ సంస్థ చక్కగా ప్లానింగ్ చేసుకొని రెండు పార్ట్ లను ఒకేసారి పూర్తి చేసి మూడు నెలల గ్యాప్ తోనే హైప్ ఉన్నప్పుడే రిలీజ్ చేస్తున్నారు. దీన్ని చూసి మిగతా పరిశ్రమ వాళ్ళు, ముఖ్యంగా టాలీవుడ్ వాళ్ళు నేర్చుకోవాలని సినిమా ఫ్యాన్స్ అంటున్నారు.
Also Read : Sushmita Konidela : బాబాయ్ భయపెట్టేవాడు.. పవన్ కళ్యాణ్ పై చిరు కూతురు కామెంట్స్ వైరల్..