Ranveer Singh: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రణ్‌వీర్ సింగ్‌కి అరుదైన గౌరవం..
బాలీవుడ్ సూపర్‌స్టార్ రణవీర్ సింగ్.. నార్త్ ఆఫ్రికా మొరాకోలో జరిగే "మర్రకేచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్"లో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. రణవీర్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రాలు.. 'బాజీరావ్ మస్తానీ', 'గల్లీ బాయ్' మరియు 'పద్మావత్' సినిమాలు ఈ ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. అంతేకాదు రణవీర్ ని..
- gum 95921
- Published On : November 11, 2022 / 12:34 PM IST
Ranveer Singh Honoured with Etoile d'Or award at Marrakesh International Film Festival
Ranveer Singh: బాలీవుడ్ సూపర్‌స్టార్ రణవీర్ సింగ్.. నార్త్ ఆఫ్రికా మొరాకోలో జరిగే “మర్రకేచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్”లో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. రణవీర్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రాలు.. ‘బాజీరావ్ మస్తానీ’, ‘గల్లీ బాయ్’ మరియు ‘పద్మావత్’ సినిమాలు ఈ ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనకి ప్రపంచ సినీ దిగ్గజాలు హాజరుకానున్నారు.
DSP and Ranveer Singh : రణవీర్‌తో కలిసి రచ్చ చేసిన దేవిశ్రీ ప్రసాద్..
వారందరి ముందు తన నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించనున్న రణవీర్ ని.. ఈ ఏడాది 19వ ఎడిషన్‌లోని ఎటోయిల్ డి’ఓర్ అవార్డుతో సత్కరించనున్నారు. గతంలో ఈ బిరుదుని భారత్ తరుపు నుంచి అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ మరియు అమీర్ ఖాన్ వంటివారు అందుకున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 11 నుండి 13 వరకు ఈ నటుడు మొరాకో నగరంలో సందడి చేయనున్నాడు.
ప్రస్తుతం రణవీర్ సింగ్ ‘సర్కస్’ సినిమాలో నటిస్తున్నాడు. టాలీవుడ్ బుట్టబొమ్మ పిజ్జా హెగ్దే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రణవీర్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో దీపికా పడుకోణె, అజయ్ దేవగన్ గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారు.
